. < 1 minute
Kamal Haasan: నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు.. కర్నాటక ఫిల్మ్‌ ఛాంబర్‌కు కమల్‌ హాసన్‌ లేఖ..

కర్నాటకలో కమల్‌ హాసన్‌ థగ్‌ లైఫ్‌ సినిమా విడుదలకు కష్టాలు మరింత పెరిగాయి. కమల్‌ హాసన్‌ తీరుపై కర్నాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు అడ్డంకులు తొలగించాలని హైకోర్టులో కమల్‌ హాసన్‌ వేసిన పిటిషన్‌ సందర్భంగా న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని మీరు ఎలా అంటారని న్యాయస్థానం ప్రశ్నించింది. మీరు చరిత్రకారులా అని కమల్‌ను నిలదీసింది కోర్టు. క్షమాపణలు చెబితే వివాదం సమసిపోతుందని వ్యాఖ్యానించింది.

కర్నాటక ప్రజల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం లేదనుకుంటే కోట్ల రూపాయల ఆదాయాన్ని మర్చిపోవాలని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. గతంలో సి.రాజగోపాలాచారి ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు క్షమాపణలు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. కమల్‌హాసన్‌ తీరుతో శివరాజ్‌కుమార్‌ కూడా ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు తెలిపింది. భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం తగదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

అయితే తన వ్యాఖ్యలపై కమల్‌హాసన్‌ మరోసారి వివరణ ఇస్తూ లేఖ విడుదల చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని అన్నారు,. కర్నాటక ఫిల్మ్‌ ఛాంబర్‌కు కమల్‌ ఈ లేఖ రాశారు. సినిమానే తన భాష అని ఈ లేఖలో పేర్కొన్నారు. తనకు అన్ని భాషలపై అభిమానం ఉందన్నారు. ప్రేమ తోనే అలా వ్యాఖ్యానించినట్టు చెప్పారు . సినిమా ప్రజలను ఏకం చేస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.