వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలో వేడి నుండి ఉపసంహణం పొందడమే కాకుండా అనేక సమస్యలను కూడా ఎదురుకోవాల్సి ఉంటుంది. అధిక వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్కూటర్ నడిపేవారు. ఎందుకంటే వర్షాల సమయంలో స్కూటర్ స్లిప్ అవుతాయి. దీనికి ప్రధాన కారణం వాటికి ఉన్న టైర్లు. అయితే వర్షాకాలంలో స్కూటర్ ను సురక్షితంగా ఎలా నడపాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
స్కూటర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హాఫ్ ఫేస్ హెల్మెట్లను ధరించడం తరచుగా చూస్తాం. కానీ, ఎల్లప్పుడూ ఫుల్ ఫేస్ హెల్మెట్ ను ధరించాలి. ఎందుకంటే ఫుల్ ఫేస్ హెల్మెట్ మరింత సురక్షితమైనవి. ఇవి ప్రమాదం సమయంలో తల, ముఖాన్నిప్రమాదం నుండి కాపాడతాయి. హెల్మెట్ లేకుండా ఎప్పుడూ డ్రైవ్ చేయవద్దు.
ఒకవేళ స్కూటర్ కు ఇప్పటికీ అరిగిపోయి పాత టైర్లు ఉంటే, వెంటనే వాటిని మార్చడం చాలా మంచిది. ఎందుకంటే అలాంటి టైర్లు కు గ్రిప్ ఉండదు. వర్షంలో ప్రమాదాలకు అత్యంత సాధారణ కారణం కూడా అవొచ్చు.
వర్షంలో స్కూటర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వర్షానికి తగ్గట్టు వెళ్ళాలి. వర్షం ఎక్కువ ఉంటె వేగాన్ని తగ్గించుకోవాలి. వర్షంలో కొంచెం స్పీడ్ గా నడిపిన అది ప్రమాదానికి దారి తీస్తుంది. కాబట్టి వర్షంలో 40 కి.మీ. లోపల మాత్రమే ప్రయాణించాలి.
వర్షాకాలంలో సడన్ బ్రేక్‌లు వేయడం మానుకోవాలి. ఒకవేళ బ్రేక్ వేయవలసి వస్తే, స్కూటర్‌ను వేగాన్ని తగ్గించాలి. మరో విషయం ఏమిటంటే, ముందు, వెనుక బ్రేక్ ఒకేసారి వేయాలి. ఇలా చేయడం ద్వారా స్కూటర్ స్లిప్ కాదు.
వర్షం సమయంలో రోడ్లు నీటితో నిండిపోతాయి. దీంతో రోడ్డు స్పష్టంగా ఉందో లేదో కనిపించదు. కాబట్టి నీరు నిలిచి ఉన్న రోడ్డు పై వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. అంతేకాకుండా రోడ్డుపై మాత్రమే డ్రైవ్ చేయాలి. చదును చేయని రోడ్లపైకి వెళ్లకుండా ఉండాలి.