జుట్టు రాలడానికి మందార పువ్వు మంచి నివారణ అని అందరికీ తెలిసిన విషయమే. కానీ అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మందార పువ్వు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. మందారం చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలను ఇది తొలగిస్తుంది. మీ ముఖం అందంగా, మెరిసేలా చేస్తుంది.
మందార మొగ్గలను రుబ్బి వాటి రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా ఉంటుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మందార ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది.
మందార పువ్వులను ఆహారంలో తీసుకోవడం వల్ల కొవ్వును కరిగించి శరీర బరువు తగ్గుతుంది. మందార ఆకులతో చేసిన టీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.
మందార పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. చర్మంపై ఉండే ముడతలు, గీతలు తగ్గిపోతాయి. అలాగే చర్మం తేమగా ఉంటుంది. మందార పొడిలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మందార పొడిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. హైపర్పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
ఎండిన మందార పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ అందాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మందార పొడిలో ఉండే సహజ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. చనిపోయిన చర్మ కణానలను తొలగించి స్కిన్ కలర్ ను మెరుగుపర్చడానికి సహాయపడతాయి.