. 2 minutes
Best smartphones: ఫొటోగ్రఫీ అంటే మీకు ఇష్టమా..? అయితే ఈ ఫోన్లు మీ కోసమే..!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. వాటిలో కొన్ని ఫొన్లను ఫొటోగ్రఫీ కోసం ప్రత్యేక ఫీచర్లతో రూపొందించారు. ముఖ్యంగా చాలా మంది స్మార్ట్ ఫోన్లను ఫొటోగ్రఫీ ఫీచర్లను చూసి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్ల నుంచి విడుదలైన బెస్ట్ ఫొటోగ్రఫీ ఫోన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్

ఫొటో గ్రఫీ కోసం మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ చాలా బాగుంటుంది. దీనిలో 200 ఎంపీ ప్రధాన కెమెరా ఏర్పాటు చేశారు. తక్కువ కాంతి ఉన్నప్పటికీ మెరుగైన చిత్రాలను తీస్తుంది. ఆటో ఫోకస్ కలిగిన 12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ క్లోజప్ మాక్రో షాట్ లకు మద్దతు ఇస్తుంది. అలాగే 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వీడియో కాల్స్, సెల్ఫీలు తీసుకోవచ్చు. 6.7 అంగుళాల క్వాడ్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్, ఐపీ 68 రేటింగ్ అదనపు ప్రత్యేకతలు.

వీవో ఎక్స్ 200 ప్రో

ఫొటోగ్రఫీకి పనికి వచ్చే ఉత్తమ ఫోన్లలో వీవో ఎక్స్ 200 ప్రో ఒకటి. దీనిలో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ తో ఫొటోలు, వీడియోలను మంచి స్పష్టతతో తీసుకోవచ్చు. 50 ఎంపీ జీఈస్ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 60 ఎఫ్ బీఎస్, 120 ఎఫ్ బీఎస్ రెండింటిలోనూ 4కే పుటేజ్ రికార్డు చేయవచ్చు. ఎల్ టీపీవో టెక్నాలజీతో కూడిన 6.78 అంగుళాల క్వాడ్ కర్వ్ అమోలెడ్ ప్యానెల్ , మీడియా టెక్ డైమెన్సిటీ 9400 చిప్ సెట్ ఏర్పాటు చేశారు.

సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా

ఆధునాతన టెక్నాలజీ కలిగిన నాలుగు కెమెరా సెటప్ తో సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఆకట్టుకుంటోంది. 200 ఎంపీ వైడ్ సెన్సార్, 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10 ఎంపీ టెలిఫొటో కెమెరాతో పాటు వీడియోలు, సెల్పీల కోసం 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. 6.8 అంగుళాల ఎడ్జ్ క్యూహెచ్ డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ డిస్ ప్లే, టైటానియం ఫ్రేమ్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, వన్ టీబీ వరకూ ఆన్ బోర్డు స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

షియోమి 15 అల్ట్రా

ఫొటోగ్రఫీని ఇష్టపడేవారి కోసం ప్రత్యేక ఫీచర్లతో షియోమి 15 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చారు. దీనిలో నాలుగు కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. 50 ఎంపీ ప్రధాన సెన్సార్, 50 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 50 ఎంపీ సోనీ టెలిఫోటో కెమెరా, 200 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఇక స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్, 5410 ఎంఏహెచ్ బ్యాటరీ, కనెక్టివిటీ కోసం 5జీ, వైఫై 7,బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్ బీ 3.2 టైప్ సి ఉన్నాయి. ఐపీ 68 రేటింగ్, 6.73 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.