
హైదరాబాద్: ప్రిజం పబ్ ఇష్యూపై నటి కల్పిక స్పందించారు. మంగళవారం (జూన్ 3) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2025, మే29 రాత్రి ప్రిజం పబ్‌లో నార్మల్ డిస్కషన్ కాస్త గొడవకు దారి తీసిందని ఆమె తెలిపారు. పబ్ సిబ్బంది తన పట్ల దరుసుగా ప్రవర్తించారని.. అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. పబ్ సిబ్బంది మాటలతోనే అత్యాచారం చేశారని కల్పిక వాపోయారు.
‘‘నా బర్త్ డే సందర్భంగా ప్రిజం పబ్‌కు బ్యాండ్ అమృత్ అనే షో కి వెళ్ళాను. పబ్‌లో నాకు సాంగ్ డెడికేట్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. అంతా ఐపోయాక 2.2k బిల్ అయిందని పబ్ యాజమాన్యం చెప్పారు. బర్త్ డేస్‌కు మిగతా పబ్స్‌లో కాంప్లిమెంటరీ కేక్ ఇచ్చే కల్చర్, బిల్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటాయి. దాని దృష్టిలో పెట్టుకొని కేక్ ఇచ్చే అవకాశం ఉందా అని పబ్ సిబ్బందిని అడిగా. మా దెగ్గర అలాంటి ఆఫర్స్ ఏమి లేవు అని చెప్పారు. పబ్ ఇంచార్జీని పిలిస్తే అతనితో కూడా మాట్లాడాను. హైద్రాబాద్‌లో ఈ కల్చర్ నడుస్తుందని చెప్పా. కానీ మేనేజర్ కూడా కుదరదు అని చెప్పాడు. బహుషా నేను అది అడగడం తప్పు అయింది. కాంప్లిమెంటరీ లేదు అంటున్నారు. స్టాఫ్, మేనేజర్స్ అందరూ పంచాయతీ చేశారు.
మధ్యలో ప్రణీత్ అనే వ్యక్తి వచ్చాడు.. తను కూడా వ్యంగ్యంగా బర్త్ డే విషెస్ చెప్పాడు. అతడికి జరిగిన విషయం చెప్పాను. బిల్‌ని బట్టి డిస్కౌంట్ కన్సిడర్ చేస్తామన్నారు. బిల్ కట్టి వెళ్ళండి అంటూ వల్గర్‌గా మాట్లాడారు. బిల్ చేసి వెళ్లిపోండి.. మీరు మాకు అవసరం లేదన్నారు. వాళ్లు ప్రవర్తించిన తీరుపై నాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా. నా వెంబడి ఒక ఫ్రెండ్ వచ్చాడు.. తను ఫిజికల్ ఛాలెంజ్డ్. పబ్‌లో గొడవ స్టార్ట్ అవ్వగానే ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టా. నాకంటే ముందు వాళ్లు కెమెరా రికార్డ్ చేశారు. పబ్లిసిటీ కోసమే వచ్చావ్ అంటూ వ్యంగ్యగా మాట్లాడారు.
దీంతో నేను వాళ్లను దూషించి.. పోలీసులను పిలవండని చెప్పాను. వచ్చిన పోలీసులు కూడా పబ్ సిబ్బందికే సపోర్టుగా మాట్లాడారు అనిపించింది. పబ్ బౌన్సర్లు నన్ను ఫాలో అయ్యారు. మొత్తం 17 మంది పబ్‌లో హంగామా చేశారు. నన్ను, నా పేరెంట్స్, నా పెంపకాన్ని తిట్టారు.. నా ఫ్రెండ్‌పై అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అంటోని అనే వ్యక్తి భూతులు మాట్లాడుతూ, బాడీ షేమింగ్ చేశాడు. నా ఫ్రెండ్ పట్ల ఘోరమైన భూతులు మాట్లాడాడు. నేను నా ఫ్రండ్ను ప్రొటెక్ట్ చేశాను. పోలీసులు కూడా పబ్ వాళ్లకే వత్తాసు పలికారు. చివరకు బిల్‌పై డిస్కౌంట్ చేస్తామన్నారు. కానీ నేను బిల్ మొత్తం పే చేస్తా నాకు సారీ చెప్పాలని డిమాండ్ చేశా.
సారీ చెప్పకపోతే నేను బిల్ కట్టను అన్నాను. రాత్రి 11 నుంచి 2:30 వరకు పంచాయతీ నడిచింది. నేను కచ్చితంగా మాట్లాడినందుకు వాళ్ళ ఇగో హర్ట్ అయింది. పబ్ వాళ్లు నన్ను మాటలతో రేప్ చేశారు. పబ్లిసిటీ, కంటెంట్ కోసమే మీరు ఇంత రచ్చ చేశారు అని అన్నారు. ప్రిజమ్ పబ్ మీద గతంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. పోలీసులు కూడా లైట్ తీసుకోవడంతో ఈ విషయంలో కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు నన్ను అంతు చూస్తామని బెదిరించారు.
నేను వివిధ రూట్స్ మార్చుతూ ఇంటికి చేరుకున్న. ఇప్పుడు నేను వాళ్ళ సారీ కోరుకోట్లే. వాళ్లు చేసింది వాళ్లు రియలైజ్ ఐతే చాలు. నాకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు.. నేను ఎంత దూరమైన పోతా. నాకు ఆఫర్స్ లేవని ప్రచారం చేశారు. అందుకే ఇంత చేశాను అన్నారు. కానీ పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నా. బిగ్ బాస్‌కి ఫస్ట్ సీజన్ నుండి అడుగుతున్నారు.. కానీ నేను వెళ్ళలేదు. మున్ముందు వెళ్లే అవకాశం ఉంది’’ అని పబ్ లో జరిగిన గొడవపై కల్పిక వివరణ ఇచ్చారు.