. < 1 minute

బెంగళూరు: తమిళ సూపర్ స్టార్, లోక నాయకుడు కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల కన్నడు భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో స్పందించిన కర్ణాటక హైకోర్టు.. క్షమాపణ చెప్పాలని కమల్‌హాసన్‌ను ఆదేశించింది. మీరు అలాంటి స్టేట్‌మెంట్‌ ఎలా ఇస్తారని  న్యాయస్థానం ప్రశ్నించింది. కన్నడిగుల మనోభావాలను తక్కువగా అంచనా వేశారని.. సినిమా విడుదల సాఫీగా సాగాలంటే.. క్షమాపణ చెబితే సరిపోతుంది కదా అని హైకోర్టు సూచించింది.

కాగా, ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రోమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న కమల్ మాట్లాడుతూ.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కామెంట్స్ చేశారు. దీంతో కన్నడ వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కమల్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయన సినిమాను కర్నాటకలో బాయ్ కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.