కన్నడలో అనూహ్య విజయం సాధించిన ‘అపాయవీడి హెచ్చరిక’ చిత్రం ‘డేంజర్ బాయ్స్’ (Danger Boys) పేరు తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకనిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ -రిలీజ్ (Pre-release) వేడుక హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘డేంజర్ బాయ్స్‘ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా… టీజర్ ను దర్శకనిర్మాత డాక్టర్ లయన్ సాయివెంకట్, పాటలను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు సత్యవర్ధన్ విడుదల చేశారు. ట్రైలర్ను తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ ఆవిష్కరించారు.
దండుపాళ్యం, కేజిఎఫ్, కాంతారా చిత్రాల కోవలో… కన్నడలో అనూహ్య విజ యం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టించడం ఖాయమని అతిధులు పేర్కొన్నారు. ఈ ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే… ఈ చిత్రం మరో ‘మంజమల్ బాయ్స్’ అవుతుందనిపిస్తోందని వారు తెలిపారు. యశశ్విని క్రియేషన్స్, – గీతా ఫిలిమ్స్ పతాకాలపై శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో… వి.జి.మంజునాథ్, – పూర్ణిమ ఎమ్.గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి రచన, – దర్శకత్వం వహించారు అభిజిత్ తీర్ధహళ్లి.