సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, (Kiran Abbavaram) యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీగౌరి ప్రియ జంటగా కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మూవీకి ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) టైటిల్ ఖరారు చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
తొలి ప్రేమేం తోపు కాదు, ఫస్ట్ లవ్ ఫెయిలైతే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలువుతుందని చెబుతూ సాగిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ లో హీరో కిరణ్ అబ్బవరం ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నారు. శ్రీగౌరి ప్రియ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సముద్రపు ఒడ్డున ఈ జంట ఫస్ట్ లవ్, బెస్ట్ లవ్ గురించి మాట్లాడుకున్న సంభాషణ ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా సాగింది. ఈ గ్లింప్స్ కు ‘తొలి ప్రేమే తోపు కాదే తోపు కాదే..’ అంటూ మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యూటిఫుల్ బీజీఎం సాంగ్ కంపోజ్ చేశారు.