
ప్రస్తుతం కాస్త చౌకగా లభిస్తున్న ఉల్లిపాయ, టమాటాలు మరికొన్ని రోజుల్లో భారీగా ధర పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లిపాయ, టమోటా పంటలు దెబ్బతిన్నాయి. దీని కారణంగా టమాటాలు, ఉల్లిపాయల సరఫరా తగ్గింది. దీని ప్రభావం ధరలలో కనిపిస్తుంది. జూన్ లోనే టమోటా ధర రిటైల్లో రూ.24 నుండి రూ.30కి పెరిగింది. ఇది రాబోయే రెండు వారాల్లో రెట్టింపు అవుతుందని, నెలలో రూ.80 నుండి రూ.100కి చేరుకుంటుందని అంచనా. మరోవైపు, ఉల్లిపాయల ధరలు కూడా కిలోకు రూ.6 పెరిగాయి. రాబోయే ఒక నెలలో ఉల్లిపాయ ధర రూ.50కి చేరుకోవచ్చు.
నిజానికి మే నెల రెండవ పక్షం రోజుల్లో మహారాష్ట్రలో ఉల్లిపాయ ధరలలో 20 శాతం పెరుగుదల కనిపించింది. దీని ప్రభావం దేశంలోని ఇతర మార్కెట్లలో లేదా దేశ రాజధాని ఢిల్లీలో కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉల్లిపాయ, టమాటా రెండింటి పంట చాలా దారుణంగా ఉంది. భారీ వర్షాల ప్రభావం సరఫరాపై కూడా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో, ఉల్లిపాయ, టమాటా ధరలు మరింత పెరగవచ్చు.
ఢిల్లీలో ఉల్లిపాయ, టమాటా ధరలు ఎంత పెరిగాయి. గత రెండు రోజుల్లో అంటే జూన్ 1, 2 తేదీలలో ఉల్లిపాయ, టమాటా ధరలు 40 నుండి 50 శాతం పెరిగాయి. మే 31న దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లిపాయ రిటైల్ ధర కిలోకు రూ. 20 ఉండగా, జూన్ 2న అది కిలోకు రూ. 30కి పెరిగింది. మరోవైపు, గత నెల చివరి రోజున టమాటా రిటైల్ ధర కిలోకు రూ.20గా ఉండగా, జూన్ 2న అది కిలోకు రూ.35కి పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి