. < 1 minute

AamirKhan: ఆమెతో డేటింగ్ నిజమే.. కొత్త గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేసిన అమీర్ ఖాన్

Caption of Image.

వైవిధ్యమైన కథలు, పాత్రలతో మూడు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్. ఇటీవల ఆయన తన ప్రేమ సంగతి వెల్లడించాడు. గౌరీ స్పాతో డేటింగ్లో ఉన్నట్లు చెప్పాడు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ వివరాలు బయ టపెట్టాడు. అయితే గౌరీ స్పాతో ప్రేమలో పడాలనే ఆలోచనకు చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నట్లు చెప్పాడు.

ఇద్దరం అనుకోకుండా కలిసి స్నేహితులు అయినట్లు, ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పుట్టినట్లు తెలిపాడు. ఏడాదిన్నర కాలంగా ఆమెతో డేటింగ్లో ఉన్నట్లు వెల్లడించిన ఆమిర్., గౌరీని తన 60వ పుట్టినరోజు సందర్భంగా మీడియాకు పరిచయం చేశాడు. కానీ, మేము భార్యాభర్తలు కాకపోవచ్చని.. ఎల్లప్పుడూ ప్రేమతో ఒక కుటుంబంగానే ఉంటామని అమీర్ అన్నారు. ఆమె కొంతకాలంగా హీరో నిర్మాణసంస్థలో సహాయకురాలిగా పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య 25 ఏళ్ల స్నేహబంధం ఉంది.

అలాగే తన మొదటి భార్య రీనా దత్తాతో పెళ్లి తొందరపాటు నిర్ణయం అని చెప్పారు. అది తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఆయన అన్నారు. కేవలం నాలుగు నెలల పరిచయంతోనే పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు ఆలోచిస్తే ఆ నిర్ణయం తప్పు అనిపిస్తుందని చెప్పారు. 39 ఏళ్ల క్రితం తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు ఊహించుకోలేనని తెలిపారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BollywoodNow (@bollywoodnow)

ఆమిర్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వారు 16 సంవత్సరాలు కలిసి ఉన్నారు మరియు వారికి ఇద్దరు పిల్లలు. జునైద్ మరియు ఇరా. 2002లో విడిపోయిన తర్వాత, అతను 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. 2011లో వారి కుమారుడు ఆజాద్ రావు ఖాన్‌ పుట్టాడు. 15 సంవత్సరాలు వారి వివాహ జీవితాన్ని కొనసాగించారు.

అమీర్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన సితారే జమీన్ పర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తర్వాత ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం పట్టాలెక్కించడానికి సన్నాహాలు మొదలు పెడుతారని తెలుస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.