
IPL-2025 ఫైనల్ అంకానికి చేరింది. క్రికెట్ ఫ్యాన్స్ గంటలు, నిమిషాలు అన్నట్లుగా లెక్కపెడుతూ ఎదురు చూస్తున్నారు. అద్భుత పర్ఫామెన్స్ తో ఫైనల్ కు చేరిన రెండు టీమ్స్ లో ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్ల నుంచి ఫ్యాన్స్ వరకు RCB దే కప్ అని కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ముంబైని ఇంటికి పంపించి పంజాబ్ గెలిచిన తీరును చూసి PBKS విజేతగా నిలవడం పక్కా అని కొందరు అంటున్నారు.
మరోవైపు రెండు టీమ్స్ కెప్టెన్లు కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. కోహ్లీ కోసం కప్ పక్కా కొడతామని బెంగళూర్ కెప్టెన్ పటిదార్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. కోహ్లీ టీమిండియా తో పాటు బెంగళూర్ టీం కోసం ఎంతో చేశాడు. కప్ గెలిచి ఆయనకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాం అని అన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ తో సహా అన్ని విభాగాల్లో తమకు ఎదురు లేదని నమ్మకంగా చెప్తున్నాడు ఆర్సీబీ కెప్టెన్.
అదే సమయంలో.. క్వాలిఫైయర్-2 మ్యాచ్ లో 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ను ఇంటికి పంపించి భారీ అంచనాలు నమోదు చేసింది పంజాబ్. ముంబై ఇచ్చిన భారీ టార్గెట్ ను అలవోకగా ఛేదించి గెట్ రెడీ అంటూ బెంగళూర్ కు ఛాలెంజ్ విసిరింది శ్రేయాస్ సేన. ముఖ్యంగా అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ చూసి.. అయ్యారే అనుకున్నారు క్రికెట్ విమర్శకులు.
ఈ ఉత్కంఠ పరిస్థితుల్లో బెంగళూర్ ఫ్యాన్స్ 18 సెంటిమెంట్ పై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ సారి ఆ సెంటిమెంట్ ప్రకారం బెంగళూరు గెలవడం పక్కా అని సోషల్ మీడియాలో పోస్ట్ ల మీద పోస్టులు పెడుతున్నారు. ఆ సెంటిమెంట్ ఏంటో తెలుసుకోవాల్సిందే.
బెంగళూర్ బాద్షా విరాట్ కోహ్లీ జెర్సీ నెం.18. అదే విధంగా ఐపీఎల్-2025 సీజన్ కూడా 18వ సీజనే. దీనికి తోడు ఇవాళ (జూన్ 3) తేదీ మొత్తాన్ని కూడితే కూడా 18 వస్తుంది. అంటే 3+6+2+0+2+5=18. కోహ్లీ జెర్సీ నుంచి ఇవాళ్టి తేదీ వరకు అంతా 18 రావటంతో.. ఇది శుభసూచకం అంటున్నారు ఫ్యాన్స్. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని.. ఆర్సీబీదే పక్కా గెలుపు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చూడాలి మరి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో.
All signs point to 18! 🔥
🔸 Virat Kohli’s Jersey No. – 18
🔸 18th Edition of IPL
🔸 Final on 3/6/2025 → 3+6+2+0+2+5 = 18
Is this destiny? 👀 pic.twitter.com/Sn9vHnYGhS
— V I P E R (@VIPERoffl) June 3, 2025