. < 1 minute

మీకేంటి సారీ చెప్పేది.. నేనే నా సినిమాలు రిలీజ్ చేయను : కమలహాసన్

Caption of Image.

బెంగళూరు: కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతానికి కన్నడలో ‘థగ్ లైఫ్’ సినిమాను విడుదల చేసేది లేదని కమల్ హాసన్ తరపు కౌన్సిల్ కర్ణాటక హైకోర్టుకు స్పష్టం చేసింది. కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని కమల్ నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. కోర్టు చెప్పినా డోంట్ కేర్ అన్నట్లు తన వ్యాఖ్యలనే సమర్థించుకున్నారు. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందన్న తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గకపోగా.. ‘‘అంతా నా ఇష్టం’’ అనే రీతిలో కోర్టుకు బదులిచ్చారు.

ఈ క్రమంలోనే తన కొత్త సినిమా ‘థగ్ లైఫ్’ విడుదలపై వస్తున్న బెదిరింపులను కూడా లెక్క చేయటం లేదు. కమలహాసన్ కొత్త సినిమా ‘థగ్ లైఫ్’ జూన్ 5న విడుదల కాబోతున్న సమయంలో.. కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KPCC) వార్నింగ్ ఇచ్చింది. ‘‘సారీ చెప్పు.. క్షమాపణ చెబితే వదిలేస్తాం’’ అంటూ ప్రకటించింది. దీనికి ఏ మాత్రం వెనక్కి తగ్గని కమలహాసన్.. సారీ చెప్పేది లేదు.. మీకేంటి సారీ చెప్పేది అంటూ.. అసలు తన కొత్త సినిమా థగ్ లైఫ్ ను.. తానే కన్నడంలో విడుదల చేయటం లేదని ప్రకటించి.. షాక్ ఇచ్చారు.

►ALSO READ | Rana Naidu 2 Trailer: వెంకటేష్, రానా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. తొలి సీజ‌న్‌ని మించి మరింత వైల్డ్గా!

‘తమిళం నుంచి కన్నడ భాష పుట్టింది’అని కమల్ హాసన్‌‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటక రక్షణ వేదికతో పాటు కర్ణాటకలోని పలు ప్రజా సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మే 30లోగా క్షమాపణలు చెప్పకపోతే సినిమాను బహిష్కరిస్తామని కర్ణాటక ఫిల్మ్‌‌ ఛాంబర్‌‌ హెచ్చరించింది. డెడ్‌‌లైన్‌‌ ముగిసినా కమల్ క్షమాపణలు చెప్పకపోవడంతో ‘థగ్‌‌లైఫ్‌‌’చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్‌‌ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టు కమల్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన కమల్ హాసన్ తన ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదని ప్రకటించారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.