
సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు నిత్యం చక్కర్లు కొడుతూ ఉంటాయి. నెటిజన్స్ కూడా సెలబ్రెటీల ఫోటోలను పజిల్స్ గా వాడుతుంటారు. ఇక పై ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? ఒకప్పుడు విలన్ గా అదరగొట్టి ఇప్పుడు కమెడియన్ గా నవ్వులు పూయిస్తున్నాడు. పై ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా..? ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా నటించి మెప్పించాడు. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు ఆయన ఇంతకూ ఆయన ఎవరంటే..
పై ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు మొట్టా రాజేంద్రన్ కానీ ఆయన పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టక పోవచ్చు కానీ చూస్తే మాత్రం టక్కున నవ్వేస్తారు. హీరో సూర్య నటించిన సింగం సినిమాలో విలన్ పక్కన ఉండే సహాయం అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆతర్వాత రాజారాణి సినిమాలో హీరో పని చేసే ఆఫీస్ లో బాస్ గా నటించాడు. వీటితో పాటు శివకార్తికేయన్ హీరోగా నటించిన రెమో సినిమాలో నటించాడు రాజేంద్రన్. కమెడియన్ గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ నటుడి బ్యాగ్రౌండ్ గురించి చాలా మందికి తెలియకపోవొచ్చు. పైకి సింపుల్ గా కనిపిస్తున్న ఆయన.. కోట్ల ఆస్తిపరుడు. కానీ ఆయన ఎన్నో కష్టాలు పడి ఆస్థాయికి వచ్చారు.
రాజేంద్రన్ బక్కగా, గుండుతో నల్లటి ఆకారంతో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రాజేంద్రన్. అయితే రాజేంద్రన్ కెరీర్ బిగినింగ్ లో స్టంట్‌కు, డూప్‌గా నటించాడు. చాలా సినిమాల్లో ఫైట్ సీన్స్ లో కనిపించాడు రాజేంద్రన్. అయితే 500కు పైగా చిత్రాల్లో స్టంట్ గా వర్క్ చేశాడు. తెలుగు, తమిళ్ సినిమాల్లో ఫైటర్ గా కనిపించాడు. అలాగే పితామగన్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆతర్వాత నటుడిగా వరుసగా సినిమాలు చేశాడు రాజేంద్రన్.
అయితే రాజేంద్రన్ ఓ సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడు. చెన్నైలోని కళపేటలోఓ సినిమా షూటింగ్ లో ఓ నటుడిని కొట్టి పక్కనే ఉన్న చెరువులో పడెయ్యాలి. కానీ ఆ చెరువులో రసాయనాలు కలిసున్నాయని తెలియని రాజేంద్రన్ ఆ చెరువులో పడిపోయాడు. అయితే ఆ రసాయనాలు ఉండటంతో.. రాజేంద్రన్ జుట్టు మొత్తం రాలిపోయింది. ఇక భవిషత్తులో జుట్టు రాకుండపోయింది. అలాగే కనుబొమ్మలు కూడా పోయాయి. అలాగే నల్లగా రంగు మారిపోయింది. మొఖం కూడా వింతగా తయారయ్యింది. అలాగే ఆయన రసాయనాలు కలిసిన నీళ్లు కడుపులోకి వెళ్లడంతో ఆయనకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. జీర్ణాశయ సమస్యలు కూడా వచ్చాయట. ఆ సమయంలో ఆయన దగ్గర డబ్బులు కూడా లేవట. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సాయం కూడా చేయలేదట. ఇక ఆ సమస్యలన్నీ దైర్యంగా ఎదుర్కొన్న రాజేంద్రన్ తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. కమెడియన్ గా, నటుడిగా 160కు పైగా సినిమాల్లో రాజేంద్రన్ నటించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.