. < 1 minute

Suniel Narang

హైదరాబాద్: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ (Suniel Narang) రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే సునీల్ రాజీనామా చేయడం గమనార్హం. తనను సంప్రదించకుండానే కొందరు ప్రకటనలు ఇస్తున్నారని సునీల్ అన్నారు. తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు తాను బాధ్యుడిని కాదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా తాను పదవిలో కొనసాగలేనని తెలిపారు.

కాగా, శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మరోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ (Suniel Narang), ఉపాధ్యక్షులుగా రవీంద్ర గోపాల్, కె ఉదయ్ కుమార్ ఎన్నికయ్యాయరు. వీఎల్ కార్యదర్శిగా శ్రీధర్‌ ‌, జాయింట్ సెక్రటరీగా జే చంద్ర శేఖర్ రావు ఎంపికయ్యారు. బీ సత్యన్నారాయణ గౌడ్‎ను ట్రెజరర్ ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా 14 మంది నియామకమైన విషయం తెలిసిందే.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.