
ఒక సంవత్సరంలో చంద్రునికి పన్నెండు దశలు ఉంటాయి. కనుక హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా సంకష్టి చతుర్థి జరుపుకుంటారు. ప్రతి సంకటహర చతుర్థి తిధికి ఒక నిర్దిష్టమైన పేరు, ప్రాముఖ్యత ఉంది. సంకష్టి అంటే విముక్తి .. గణేషుడిని విఘ్నాలకధిపతి, దుఃఖార్థ (దుఃఖాలను తొలగించేవాడు) అని పూజిస్తారు కనుక.. ఈ రోజున భక్తులు అడ్డంకులు, దుఃఖాలను తొలగించడానికి ఉపవాసం ఉంటారు. ఈ రోజున చేసే పూజని సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గణేషుడిని అడ్డంకులు లేదా సమస్యలను తొలగించే దేవుడిగా పూజిస్తారు. సంకష్టి ఉపవాసం పాటించే ఆచారం 700 BCలో ప్రారంభమైందని నమ్ముతారు.
సంకటహర చతుర్థి ప్రాముఖ్యత
సంకటహర చతుర్థి రోజున భక్తులు గణేశుడి కృష్ణ పింగళ మహా గణపతి అవతారాన్ని, శ్రీ శక్తి గణపతి పీఠాన్ని పూజిస్తారు. సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవ రాజు యుధిష్ఠిరుడికి ఈ ఉపవాసం ప్రాముఖ్యతను వివరించాడు. అందువల్ల భక్తుడు గణేశుడి ఆశీర్వాదం పొందడానికి సహాయపడే పురాతన సంప్రదాయంగా ఇది పరిగణించబడుతుంది. భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. వ్రత కథను చదువుతారు. చంద్రుడిని చూసిన తర్వాత గణేశుడిని పూజిస్తారు. కనుక ఈ పూజ సమయం చంద్రోదయ సమయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సంకష్టి రోజున భక్తులు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. చంద్రుడిని దేవుడిని పూజించిన తర్వాత మాత్రమే ఈ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు.
సంకటహర చతుర్థి రోజున ఏర్పడే మూడు శుభ యోగాలు
జేష్ఠ మాసం కృష్ణ పక్ష చతుర్థి తిథిని కృష్ణపింగళ సంకటహర చతుర్థి అని అంటారు. ఈసారి జూన్ 14న సంకష్టి చతుర్థి రోజున 3 శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ రోజున పాతాళ భద్ర ఉంటుంది. ఈ తిథి రోజున పగలు గణేష్ పూజ , రాత్రి చంద్ర పూజ నిర్వహిస్తారు. కనుక ఈ రోజు పూజా శుభ సమయం, ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం.
ఈసారి కృష్ణపింగళ సంకష్టి చతుర్థి రోజున 3 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. దీనితో పాటు భద్రు నీడ కూడా ఈ రోజున ఉంటుంది. కనుక సంకష్టి చతుర్థి రోజున గణపతిని, చంద్రుడిని పూజిస్తారు. ఈ సంకష్టి చతుర్థి రోజున 3 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఉపవాసం ఉన్న రోజున మధ్యాహ్నం 01:13 వరకు బ్రహ్మ యోగం ఉంటుంది. ఇంద్ర యోగం మధ్యాహ్నం 01:13 నుంచి రాత్రి వరకు ఉంటుంది. చతుర్థి తిధి రోజున సర్వార్థ సిద్ధి యోగం జూన్ 15న అర్థరాత్రి 12:22 నుంచి ఉదయం 05:23 వరకు ఉంటుంది. కృష్ణపింగళ సంకష్టి చతుర్థి రోజున శివవాస యోగం ఏర్పడుతుంది, ఇది మధ్యాహ్నం 03:46 నుంచి ఏర్పడుతుంది. ఈ శుభ సందర్భంగా మహాదేవ కైలాస పర్వతంపై పార్వతితో కలిసి ఆశీనుడయ్యాడని నమ్మకం.
సంకటహర చతుర్థి తేదీ ప్రాముఖ్యత
వేద క్యాలెండర్ ప్రకారం సంకష్టి చతుర్థి జూన్ 14వ తేదీ, శనివారం మధ్యాహ్నం 3:46 గంటలకు ప్రారంభమై జూన్ 15, మధ్యాహ్నం 3:51 గంటలకు ముగుస్తుంది. సంకష్టి చతుర్థి జూన్ 14, శనివారం ఉదయతిథితో జరుపుకుంటారు.
చంద్రోదయ సమయం
జూన్ 14 – రాత్రి 10:07గంటలకు
చంద్రుడికి సమర్పించాల్సిన నైవేద్యం
కృష్ణపింగళ సంకష్టి చతుర్థి తిథి రోజున చంద్రుడిని పూజించాలి. చంద్రుడికి పచ్చి పాలు సమర్పించండి. ఈ రోజు చంద్రుడిని పూజించడం ద్వారా జాతకంలోని చంద్ర దోషాలను పోగొట్టుకోవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.