. < 1 minute
Kattalan Sunils Powerful Poster From The Movie Kattalan

తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేెదు. కమెడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్న ఆయన కమెడియన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా సినిమాలు సునీల్ కామెడీ వల్లే ఆడాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కమెడియన్,హీరో.. పాత్రలో అలరించిన సునీల్ ‘పుష్ప’ సినిమాతో విలన్‌గా నటించి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది.. దీంతో సునీల్‌కి అని పవర్ ఫుల్ పాత్రలు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మళయాళం మూవీ ‘కట్టలన్’ లో నటిస్తున్నాడు సునీల్.

Also Read : Pawankalyan : వీరమల్లు పై మండి పడుతున్న సింగిల్ స్క్రీన్స్‌ యాజమన్యం..

ఇది కూడా విలన్ పాత్ర కావడం విశేషం. నయా దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, షరీఫ్ ముహమ్మద్ నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా హై-యాక్షన్ థ్రిల్లర్ మూవీలో, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సునీల్‌కు సంబంధించిన  అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. మునుపెన్నడూ చూడని స్టైలీష్ లుక్ లో కనిపించాడు సునీల్.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.