. 2 minutes

ఫ్రెండ్ను కలిసేందుకు వెళ్లి 21వ ఫ్లోర్ నుంచి దూకేసింది.. సూసైడ్ నోట్ చూస్తే కన్నీళ్లు ఆగవు

Caption of Image.

మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. లక్షలల్లో సాలరీ.. చెప్పుకునే సమస్యలేవీ లేవు.. అలాగని లవ్ ఫెయిల్యూర్ లాంటి ఇష్యూలు కూడా ఏం లేవు. కానీ 21వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఒక సాఫ్ట్ వేర్ యువతి. హృదయాలను కరిగించేలా సూసైడ్ నోట్ రాసి.. తనవు చాలించింది. పుణెలో జరిగిన ఈ ఘటన  దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. పుణెలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న అభిలాశ భౌసాహెబ్ కొతింబిరే అనే 25 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకోవడం ఐటీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లి ఉన్నట్లుండి దూకేయడం షాకింగ్ కు గురి చేసింది. ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో ఆందోళన నింపడమే కాకుండా టెక్ ఇండస్ట్రీలో పని చేస్తున్న యువత మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తుంది. 

ఆత్మహత్య చేసుకున్న అభిలాశ రాసిన సూసైడ్ నోట్ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. ‘‘ ఐయామ్ డన్ లివింగ్. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీమోర్’’ అంటూ రాసిన సూసైడ్ నోట్ ఆందోళన కలిగిస్తోంది. ‘‘నేను బతకడం అయిపోయింది.. నాకు బతకాలని లేదు’’ అంటూ పేరెంట్స్ కు క్షమాపణ చెప్తూ రాసిన నోట్ చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

మంచి బూమ్ ఉన్న ఐటీ సెక్టార్, ఆకర్షణీయమైన సాలరీ, పాష్ లైఫ్.. ఇవన్నీ ఉన్న యువత మానసిక పరిస్థితి ఎలా ఉందో ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ అని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి జాబ్స్ చేస్తున్న ఎంప్లాయిస్.. మానసికంగా వారితో వారే యుద్ధం చేస్తూ ఘోరమైన స్ట్రెస్ లో కాలం గడుపుతున్నారని చెబుతున్నారు. 

ఇక సూసైడ్ చేసుకున్న అభిలాశ విశయానికి వస్తే.. మే 31న తెల్లవారు జామున 4.30 కు పుణె హింజవాడిలోని క్రౌన్ గ్రీన్ సొసైటీకి చేరుకుంది. 21వ ఫ్లోర్ లో ఉంటున్న ఫ్రెండ్ ను కలిసేందుకు లిఫ్ట్ మార్గంలో వెళ్లింది. అక్కణ్నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి జూన్ 5న కేసు నమోదు చేశారు పింప్రి చించ్వాడ్ పోలీసులు. 

ఏ కారణం లేకుండా సాఫ్ట్ వేర్ సూసైడ్ చేసుకోవడం పోలీసులకు ఆందోళన కలిగిస్తోంది. టెక్ ఫీల్డ్ లో జాబ్ చేస్తున్న యూత్.. ఎప్పుడూ వర్క్ ప్రెజర్ తో ఆందోళనలో గడుపుతారని.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యాంగ్జైటీ తో బాధపడుతుంటారని పోలీసులు తెలిపారు. సైకాలిజకల్ గా చాలా దారుణ పరిస్థితుల్లో టెక్ ఎంప్లాయిస్ ఉన్నారని.. కారణం లేకుండానే ఇలాంటి ఘోర నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. 

అభిలాశ ఆత్మహత్యపై సోషల్ మీడియాలో చాలా రెస్పాన్స్ వస్తోంది. #RIPAbhilasha, #MentalHealthMatters  అనే హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. ఈ ఒత్తిడి సంస్కృతిని మార్చాల్సి ఉందని.. మానసికంగా ఎంతో మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని పోస్టులు పెడుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.