. < 1 minute

ఐసీయూలోనే జూబ్లీహిల్స్​ఎమ్మెల్యే గోపీనాథ్

Caption of Image.

గచ్చిబౌలి, వెలుగు : తీవ్ర అస్వస్థతకు గురైన జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఏఐజీ వైద్యుల బృందం గోపీనాథ్​కు చికిత్సను అందజేస్తున్నారు. శుక్రవారం మంత్రి శ్రీధర్​బాబు, నగర మేయర్​విజయలక్ష్మీ ఆసుపత్రికి చేరుకొని గోపీనాథ్​ కుటుంబసభ్యులను పరామర్శించారు.

 అనంతరం ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను ఆడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే గోపినాథ్​ తనకు అత్యంత సన్నిహితుడని, ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరమన్నారు. త్వరలోనే గోపినాథ్ కోలుకొని ప్రజాసేవ చేసేందుకు వస్తారని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.