
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకు రానుంది. తల్లైన తర్వాత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె మళ్లీ ముఖానికి రంగు వేసుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ తో కలిసి ‘కింగ్’ సినిమాలో దీపిక నటిస్తోంది. ఇక సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘స్పిరిట్’ సినిమాకు కూడా దీపిక నే హీరోయిన్ అనుకున్నారు. అయితే వివిధ కారణాలతో దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుంది. బదులుగా ఆమె స్థానంలో తృప్తి దిమ్రీని కథానాయికగా ఎంచుకున్నారు. కాగా ఒక బిడ్డకు తల్లి అయిన దీపికా పదుకొనే రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాననడం, ఎక్కువ పారితోషికం కూడా అడగడంతో సందీప్ రెడ్డి వంగానే దీపికను తప్పించడని వార్తలు వచ్చాయి. అయితే స్పిరిట్ తర్వాత దీపిక ఇప్పుడు ‘కల్కి’ సినిమా సీక్వెల్ లో కూడా నటించడం లేదని ప్రచారం జరుగుతోంది.
‘కల్కి 2898 AD’ అనే తెలుగు పాన్-ఇండియా చిత్రంలో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా మొదటి భాగం ఇప్పటికే విడుదలైంది. రెండవ భాగం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంతలో దీపికా పదుకొనే పని గంటలు, పారితోషకం గురించిన వార్తలు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో ‘కల్కి 2898 AD’ చిత్ర బృందం కూడా దీపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా మొదటి భాగం ఇప్పటికే విడుదలైంది కాబట్టి రెండవ భాగంలో దీపిక స్థానంలో మరో నటిని పెట్టడం సాధ్యం కాదు. కానీ ఆమె పాత్రకు ముగింపు ఇచ్చే అవకాశమూ లేకపోలేదు.
దీపిక లేటెస్ట్ ఫొటో షూట్..
ఇటీవల ఈ వివాదం గురించి మాట్లాడిన దీపికా పదుకొనే, ‘నా సినిమాలు ఆ హీరో సినిమాల మాదిరిగానే విజయవంతమయ్యాయి’ అని చెప్పింది. అంటే తనకు కూడా స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం ఇవ్వాలన్నది దీపిక ప్రధాన డిమాండ్. ఇప్పుడు ‘కల్కి’ రెండవ భాగానికి ఆమె ఎక్కువ పారితోషికం అడిగే అవకాశం ఉంది. మరి ‘కల్కి’ నిర్మాతలు దీపిక డిమాండ్‌కు తలొగ్గుతారా లేదా అనేది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.