. < 1 minute

నారాయణఖేడ్ లో జవాన్ల స్మారకార్థం బ్లడ్ డొనేషన్ క్యాంప్

Caption of Image.

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రాణాలర్పించిన భారత సైనికుల స్మారకార్థం నారాయణఖేడ్ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్​లో శ్రీరాం యువసేన ఆధ్వర్యంలో శుక్రవారం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు.

ఇందులో భాగంగా యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసి వారి దేశభక్తిని చాటుకున్నారు. బ్లడ్ డొనేట్ చేసిన వారికి నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, శ్రీరామ్ సేన సంఘ సభ్యులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.