. < 1 minute

Mithra Mandali movie

బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ప్రీ లుక్‌కి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ముసుగు అవతారాలలో ఉన్న నటులు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ చిత్రానికి ‘మిత్ర మండలి’ (Mithra Mandali movie) అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు.

ఫస్ట్ లుక్ అందరి అంచనాలను అందుకునేలా కట్టిపడేసేలా ఉంది. ఈ పోస్టర్ నీలిరంగు ముసుగుల వెనుక ఉన్న గ్యాంగ్ ను పరిచయం చేసింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అపరిమిత వినోదాన్ని అందించడానికి ఈ గ్యాంగ్ సిద్ధమవుతోంది. సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. ‘మిత్ర మండలి‘ (Mithra Mandali movie) చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం. బన్నీ వాస్ తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్ పతాకంపై ‘మిత్ర మండలి’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.