. < 1 minute
Villains Villains Dual Roles Kollywood Is Setting A New Trend

ఫేవరేట్ హీరోలు డబుల్ రోల్‌లో నటిస్తే ఫ్యాన్స్‌కు ఇక డబుల్ ట్రీటే.. సీనియర్ హీరోల నుంచి మొదలు.. నేటీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రామ్ చరణ్ వరకు ఎంతో మంది స్టార్స్ డ్యూయల్ రోల్ పోషించి ఎంటర్టైన్ చేశారు. బ్రదర్స్ లేదా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ లో హీరోస్ డ్యూయల్ రోల్ చేసి అదరగొడుతున్నారు. కానీ కోలీవుడ్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. కొత్త ఈక్వేషన్ స్టార్ట్ చేసింది. హీరోలే డ్యూయల్ చేయాలా.. విలన్స్ చేయకూడదా అంటుతోంది. ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన ట్రెండ్ కాదు.. 20 సంవత్సరాల క్రితమే సూర్య ‘గజినీ’ మూవీలో షురూ చేశారు మురుగుదాస్. ఇందులో బిక్షు యాదవ్ అలియాస్ ప్రదీప్ రావత్.. రామ్ అండ్ లక్ష్మణ్‌గా డ్యూయల్ రోల్ పోషించి అదరగొట్టేశారు.

Also Read : AA22xA6 : అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొనే..!

తిరిగి మళ్లీ ఇన్నాళ్లకు కోలీవుడ్ డ్యూయల్ ఫోజ్ విలన్‌లకు ప్రాణం పోస్తోంది. అజిత్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో అర్జున్ దాస్ డబుల్ ఫోజ్‌లో ఎంటర్టైన్ చేశాడు. జానీ, జామీగా యాంటోగనిస్టు రోల్స్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు. ఇక సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన ‘బెంజ్’ సినిమాలో ఇలానే ప్లాన్‌ చేస్తున్నారు. రాఘవ లారెన్స్, సంయుక్త జంటగా నటిస్తున్న ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో నివిన్ పౌలీ  విలన్‌గా కనిపించబోతున్నాడు. రీసెంట్‌గా  ఈ క్యారెక్టర్ కూడా రివీల్ చేశారు మేకర్స్. ఒకరేమో కామ్ అండ్ ఇన్నోసెంట్ కాగా, మరొకరు వయిలెంట్ గ్యాంగ్ స్టర్. ఇలా విలన్ క్యారెక్టర్లను డబుల్ ఫోజ్ చేయించి కొత్త అర్థాలు చెబుతోంది కోలీవుడ్. ఫ్యూచర్‌లో ఈ క్రియేటివిటీ.. ట్రెండ్ సృష్టిస్తుందేమో చూడాలి..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.