
ఒకప్పుడు భారతీయ సినీపరిశ్రమను ఏలేసింది. మొదటి సినిమా కంటే ముందే ఆమె వ్యక్తిగత జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని 17 ఏళ్లకే తల్లైంది. 25 సంవత్సరాల వయసులో భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. 90వ దశకంలో ఆమె కెరీర్ లో శిఖరాగ్రానికి చేరుకోకముందే తల్లి అయ్యింది. విడాకులు తీుసుకున్న తర్వాతే ఆమె అసలైన జీవితం ప్రారంభించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదండి.. బాలీవుడ్ స్టార్ డింపుల్ కపాడియా. ఆమెను బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అని కూడా పిలుస్తారు. బాబీ సినిమాతో ఆమెకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీకి చెందిన డింపుల్.. 14 ఏళ్ల వయసులోనే గుర్తింపు తెచ్చుకుంది.
రాజ్ కపూర్ నటించిన ‘బాబీ’ సినిమాతో పేరు తెచ్చుకుంది. ఆ సినిమాతోనే తెరంగేట్రం చేసిన డింపుల్ అదే సమయంలో నటుడు రాజేష్ కుమార్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని సినిమా పరిశ్రమను వదిలేసింది. ఆ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని సంవత్సరాలలోనే డింపుల్ తన భర్త నుండి విడిపోయింది. ఆ తర్వాత అతడు క్యాన్సర్ బారిన పడ్డాడు. చివరి రోజుల్లోనూ తన భార్యను చూడలేదు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది.
డింపుల్ కపాడియా 16 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుని 17 సంవత్సరాల వయసులో ట్వింకిల్ ఖన్నా అనే కుమార్తెకు జన్మనిచ్చింది. విడాకుల తర్వాత ఆమె తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ తర్వాత సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ సినీరంగంలో తనదైన ముద్ర వేస్తుంది. ఇప్పటికీ సినిమాల్లో చాలా యాక్టివ్ గా ఉంది డింపుల్.
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..