. 3 minutes
Horoscope Today: ఆ రాశుల వారి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 7, 2025): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరిగే అవకాశముంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, అనాలోచిత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఆదా యం బాగానే పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. పిల్లల చదువుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చ వద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి, పని భారం పెరిగే అవకాశం ఉంది. అధికారులు కాస్తంత ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సాయంతో ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో కొద్దిగా సమస్యలు, ఒత్తిళ్లు ఉంటాయి. పని భారం పెరిగి విశ్రాంతికి దూరమవుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద విజయాలు సాధించి ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. అవసర సమయాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా లాభాలు పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ చాలావరకు పూర్తవుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల పడతాయి. అనుకోకుండా బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం అనుకూలంగా పురోగమిస్తుంది. ఆదాయం కొద్దిగా వృద్ది చెందుతుంది. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ నమ్మకపోవడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వ్యక్తి గత సమస్యల పరిష్కారం మీద శ్రద్ద పెట్టడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిళ్లు, వేధింపులు ఉండే అవకాశం ఉంది. పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో తీరిక లభించకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితంలో పని భారం పెరుగుతుంది. తోటి ఉద్యోగుల బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు కలుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తి గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.