. < 1 minute

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఫోన్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లో బంపర్ ఆఫర్ ఉంది. ఈ ఏడాదిలో మార్కెట్లో విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రెడ్‌మి నోట్ 14 ప్రో అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై క్యాష్ బ్యాక్, బ్యాంకు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా పొందవచ్చు.

డిస్కౌంట్ వివరాలు:
రెడ్‌మి నోట్ 14 ప్రో స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రు.2 వేల వరకు బ్యాంకు డిస్కౌంట్, అదేవిధంగా రూ.779 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుకోవచ్చు. దీంతో ఈ ఫోన్ ధర దాదాపు రూ.22,200 వరకు తగ్గుతుంది. కేవలం రూ.1,960 ప్రారంభ ఈఎంఐ ధరతో సొంతం చేసుకోవచ్చు.

మరోవైపు.. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో కొనుగోలు ధర రూ.24,500కు తగ్గుతుంది. ఒకవేళ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.7000 కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్లు:
రెడ్‌మి నోట్ 14 ప్రో 6.67 అంగుళాల FHD+ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. అలాగే, 120HZ హై రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ దాదాపు 3000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్ నెస్ లెవెల్స్ అందుకుంటుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ నడుస్తుంది. అంతేకాకుండా.. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లను కలిగి ఉంది.

బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ తో 5,500 mah బ్యాటరీ తో వస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే రోజంతా వస్తుంది. ఇక కెమెరా గురించి మాట్లాడితే.. ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ త్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.ఇందులో 50MP మెయిన్ OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం.. 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.