పుష్ప-2 సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు అట్లీతో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘‘AA22xA6’’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. సైన్స్‌ఫిక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితం కానుంది. ఇప్పటికే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించనున్నారు. ఇందుకోసం ఓ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సంస్థ పని చేయనుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా హీరోయిన్గా ఎవరు కనిపించనున్నారో టీమ్ ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో దర్శకుడు అట్లీ దీపికాకు ఆమె పాత్రను పరిచయం చేయడం మనం చూడొచ్చు. అంతేకాక.. ఈ సినిమాలో దీపికాపై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.