
పూరి జగన్నాధ్-విజయ్ సేతుపతి కాంబో సెట్ ఆయిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో రానున్న మూవీకి “బెగ్గర్” అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఆన్‌లైన్‌లో పోస్టర్లో చక్కర్లు కొట్టాయి. దాంతో నిజంగానే “బెగ్గర్” టైటిల్ ఫిక్స్ అయిందనే సినీ ఫ్యాన్స్ అంతా అనుకున్నారు.
On this auspicious day of #Ugadi ✨🙏🏻
Embarking on an electrifying new chapter with a sensational collaboration 🔥Dashing Director #PuriJagannadh and powerhouse performer, Makkalselvan @VijaySethuOffl join forces for a MASTERPIECE IN ALL INDIAN LANGUAGES ❤️🔥
Produced by Puri… pic.twitter.com/Hvv4gr0T2Z
— Puri Connects (@PuriConnects) March 30, 2025
కానీ, ఆ టైటిల్ కాదని ఇటీవలే విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. అధికారిక టైటిల్ ఇంకా ప్రకటించలేదని కూడా చెప్పారు. లేటెస్ట్గా పూరి జగన్నాధ్ ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ‘భవతిభిక్షాందేహి’(BhavatiBhikshandehi) అనే టైటిల్ పూరి పరిశీలిస్తున్నారని సినీ వర్గాల టాక్. త్వరలోనే టైటిల్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
The title #BhavatiBhikshandehi is being considered for Director #PuriJagannadh‘s film starring #VijaySethupathi pic.twitter.com/bl9M1FWRhP
— Ramesh Pammy (@rameshpammy) June 7, 2025
ఇందులో సీనియర్ నటి టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాస్ట్ అండ్ క్రూ దాదాపు ఖరారు కావడంతో ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై అంతటా లొకేషన్స్ రెక్కీ చేస్తున్నారు మేకర్స్. మొదటి షూటింగ్ షెడ్యూల్‌ను ఈ జూన్ చివరి వారంలో స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో విజయ్ సేతుపతి సహా ఇతర ప్రధాన నటులంతా జాయిన్ కానున్నారు.
Let’s begin soon sir @VijaySethuoffl 🔥🔥🔥
We are all pumped up for #PuriSethupathi ❤️🔥❤️🔥❤️🔥#PuriJagannadh #Tabu @OfficialViji @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/e5QeFXtBmg
— Puri Connects (@PuriConnects) May 22, 2025
‘భవతిభిక్షాందేహి’ (తాత్కాలికంగా) మూవీలో విజయ్‌ని దర్శకుడు పూరి సరికొత్తగా చూపించబోతున్నరట. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అందర్నీ ఇంప్రెస్ చేసేలా ఉంటుందని, ఇది పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సినీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. పూరి సిగ్నేచర్ స్టైల్, విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ బ్లెండ్ చేసే ప్రత్యేకమైన కథాంశంతో విభిన్నంగా ఉంటుందని మేకర్స్ కూడా చెప్పుకొస్తున్నారు.
హిట్ అవసరం:
ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్కు హిట్ అవసరం, లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో భారీ డిజాస్టర్స్ అందుకున్నాడు. దాంతో పూరి దర్శకుడిగా పనై పోయిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఒక కథకుడిగా, దర్శకుడిగా, మాటల రచయితగా అప్పటి అంత స్పార్క్ కనిపించట్లేదని ఫ్యాన్స్ సైతం చర్చించుకుంటున్నారు. ఏదేమైనా పూరి తన కొత్త సినిమాతో కంబ్యాక్ ఇస్తే తప్ప ఈ కామెంట్స్ ఆగేలా లేవు. చివరివరకు ఏమవుతుందో చూడాలి.
From the land of Karnataka to the heart of audiences across the nation❤️🔥
Team #PuriSethupathi Proudly Welcomes the Sandalwood dynamo, Actor #VijayKumar @OfficialViji on-board for an electrifying role that will leave everyone spellbound 💥
A #PuriJagannadh Film
Starring… pic.twitter.com/T0LXN9OhUM— Puri Connects (@PuriConnects) April 28, 2025
ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారు. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
She’s electric.
She’s explosive .
She’s THE TABU.Proudly welcoming THE GEM OF INDIAN CINEMA, Actress #Tabu on-board for a ROLE as DYNAMIC as her presence in #PuriSethupathi ❤️🔥
A #PuriJagannadh Film
Starring Makkalselvan @VijaySethuOfflProduced by Puri Jagannadh,… pic.twitter.com/WGp0kkuZDl
— Puri Connects (@PuriConnects) April 10, 2025