. < 1 minute
Tollywood: 3 పెళ్లిళ్లు ఫెయిల్.. రూ.996 కోట్ల ఆస్తులు.. తనను చంపేందుకే కిల్లర్‏ను మాట్లాడుకున్న హీరోయిన్..

సినీరంగుల ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో మెప్పించింది. వైవిధ్యమైన పాత్రలు పోషించి సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. గ్లామర్ వరల్డ్ లో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆమె ఓ హాలీవుడ్ హీరోయిన్. భారతదేశంలో హాలీవుడ్ చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే హాలీవుడ్ స్టార్స్ అంటే విపరీతమైన ఇష్టమున్న అడియన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఆ తారల వ్యక్తిగత జీవితాల గురించి మీకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఈ హాలీవుడ్ లైఫ్ గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆమె మూడు పెళ్లిళ్లు ఫెయిల్ అయ్యాయి. చివరకు తనను చంపాలని స్వయంగా కిల్లర్ ను మాట్లాడుకుంది. ఆమె మరెవరో కాదు.. హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా చోలి. అందం, అభినయంతోపాటు పవర్ ఫుల్ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్.

ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.996 కోట్లు. ఆమె మూడు సార్లు వివాహం చేసుకుంది. కానీ ఆ 3 పెళ్లిళ్లు కూడా విఫలమయ్యాయి. 6 మంది పిల్లల తల్లి అయిన ఏంజెలీనా జోలీ 14 సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. 50 ఏళ్ల వయసులోనూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై ర్యాంప్ వాక్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 14 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఏంజెలీనా.. 1982లో తన తండ్రి దర్శకత్వం వహించిన లుకింగ్ టు గెట్ అవుట్ చిత్రంతో నటిగా మారింది. అందులో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్. 1999లో వచ్చిన ‘ఇంటర్రప్టెడ్’ సినిమాలో తన నటనకు ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.

ఇక వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అనేక అడ్డంకులను అధిగమించి ఇప్పుడు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఏంజెలీనా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఒక సమయంలో తనను చంపాలని స్వయంగా కాంట్రాక్ట్ కిల్లర్‌ను మాట్లాడుకుందంట. ఈ విషయాన్ని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమెకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన చేసిందట.

 

View this post on Instagram

 

A post shared by Angelina Jolie (@angelinajolie)

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.