. 2 minutes

Samantha: జ్ఞాపకాలను చెరిపేస్తున్న సమంత.. ఏ మాయ చేసావే టాటూ మాయం.. ఫోటోలు వైరల్

Caption of Image.

Samantha Tattoo: 2021లో చైతూతో సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ, నాగ చైతన్యకి గుర్తుగా వేసుకున్న టాటూల వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఏదో ఒక సందర్భంలో ఒక్కొక్కటిగా టాటూలను తొలగిస్తూ సామ్ వార్తల్లో నిలుస్తుంది. లేటెస్ట్గా మరో టాటూను తొలిగించింది సామ్.  

మొన్న‌టివ‌ర‌కూ సమంత తన వీపుపై ఉన్న ఒక టాటూ.. ఇప్పుడు కనిపించడం లేదు. చైతన్య-సమంత క‌లిసి న‌టించిన తొలి చిత్రం `ఏమాయ చేసావే`(YMC)అనే టాటూ ఉండేది. ఇపుడా టాటూ కూడా సామ్ పూర్తిగా తొల‌గించింది.

శుక్రవారం (జూన్ 6న) సమంత తన కొత్త వెంచర్ ‘నథింగ్ టు హైడ్’ యొక్క ఫస్ట్ టీజర్ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. దాంతో నెటిజన్లు ఈ మార్పును త్వరగా గమనించారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. “సమంత తన YMCటాటూను తొలగించుకుంది” అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ.. “నాకు ఎలాంటి టాటూ కనిపించడం లేదు” అని అన్నాడు. దాంతో ఇపుడీ ఈ న్యూస్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. 

సమంత టాటూల విషయానికి వస్తే:

సామ్ మెడ మీద ఉన్న YMC (ఏం మాయ చేశావే) అని మీనింగ్ వచ్చేలా షార్ట్ ఫామ్‌లో టాటూ ఒకటి ఉండగా..తన కుడి చేతి మీద మరొక టాటూ ఉంటుంది. నాగ చైతన్య, సమంత చేతుల మీద ఒకేరకమైన.. రెండు గీతలతో టాటూస్ కూడా ఉండేవి. ఇక ఆ రెండు గీతల మీనింగ్ ఏంటనేది..సమంత అప్పట్లోనే బయటకు రివీల్ చేసింది. నీ మార్గాన్ని నువ్వు ఎంచుకో..క్రియేట్ చేసుకో అనే అర్థంలో ఆ రెండు గీతలను వాడుతారట.

అలాగే నాగచైతన్యపై ప్రేమతో ‘చైతూ(Chey)’ పేరును పచ్చబొట్టు కూడా వేయించుకుంది. రొమ్ము భాగానికి దిగువన పక్కటెముకలకు పై భాగంలో అతడి పేరును టాటూ వేయించుకుంది. ఇది 2023లోనే తొలిగించింది. 

ఇకపోతే, 2010లో ఏమాయే చేసావే మూవీతో తొలిసారిగా నాగచైతన్య, సామ్ కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడిన వీళ్లిద్దరూ 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత నాలుగేళ్లు హ్యాపీగా ఉన్న ఈ జంట సడెన్ గా విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. 

ఈ మధ్యకాలంలో సమంత సినిమాల కంటే.. తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ ఏ ఎక్కువయ్యాయి. ఫామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతకొన్నాళ్లుగా వీరిమధ్య రూమర్స్ ఊపందుకున్నాయి. త్వరలొ వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో బలమైన టాక్ వినిపిస్తోంది. అందుకు బలమైన కణం లేకపోలేదు. ఈ మధ్య వీళ్ళిద్దరూ ప్రతి ఈవెంట్ లో కలిసి దర్శనమిస్తున్నారు.

సమంత ఇటీవల తన నిర్మాణ సంస్థ నుంచి శుభం మూవీ రిలీజ్ చేసింది. ఈ సినిమా విశేషాలు పంచుకుంటూ పలు ఫొటోస్ షేర్ చేసింది. అందులో డైరెక్టర్ రాజ్ కూడా ఉండటం, అతనితో సమంత క్లోజ్గా ఉండటం నెటిజన్లని ఆకర్షించేలా చేసింది. దాంతో వీరిద్దరి మధ్య పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. అయితే, ఈ ఊహాగానాలపై వారిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అంతకుముందు, సమంత మరియు రాజ్ కొంతమంది స్నేహితులతో కలిసి తిరుమల సందర్శించడం కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. 

ఇకపోతే, సమంత, రాజ్ కలిసి ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌ల కోసం పనిచేశారు. ఆమె ఇప్పుడు అతనితో ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’లో పనిచేస్తున్నారు.  అంతేకాదు.. వీరిద్దరూ  చెన్నై సూపర్ ఛాంప్స్ అనే పికిల్‌బాల్ జట్టుకు కూడా భాగస్వాములు. ఇకపోతే గతేడాది నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహం ఘనంగా జరిగింది. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.