టీం ఇండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సాధించిన ఓ అరుదైన రికార్డును స్కాట్లాండ్ యువ క్రికెటర్ బ్రాండన్ మెక్‌ముల్లెన్ (Brandon McMullen) బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు, 50 వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023-27 లీగ్ టూర్లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెక్‌ముల్లెన్ ఈ ఘనత సాధించాడు. 33వ వన్డేల్లోనే ఈ రికార్డును సాధించడం విశేషం. ఈ క్రమంలో లాన్స్ క్లూజ్నర్(42 ఇన్నింగ్స్), కపిల్ దేవ్(46 ఇన్నింగ్స్), స్టీవ్ వా (46 ఇన్నింగ్స్), షకీబ్ అల్ హసన్ (50 ఇన్నింగ్స్) లను అధిగమించాడు. కాగా, ఈ రికార్డు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మొదటిస్థానంలో నెదర్లాండ్స్ ఆటగాడు ర్యాన్ టెన్ డెష్కాట్ ఉన్నాడు. డెష్కాట్ కేవలం 25 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు సాధించాడు. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (Brandon McMullen) 33 మ్యాచుల్లో 4 సెంచరీలు, 4 అర్థ శతకాలు కలిపి 1,149 పరుగులు చేశాడు. 20.29 సగటుతో 52 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో అత్యధిక స్కోర్ 151 కాగా, బౌలింగ్‌లో ఒక ఫైవ్ వికెట్ హాల్ ఉంది.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.