. 2 minutes

మీరు తింటున్న ఫుడ్ సేఫేనా?..5 రూల్స్ ఫర్ ఫుడ్ సేఫ్టీ

Caption of Image.

వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే.. ప్రతి సంవత్సరం జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం (World Food Safety Day) జరుపుకుంటారు. మనం ఏం తింటున్నా ఆ ఫుడ్ సేఫా కాదా అన్నది తెలుసుకోవడం మన హక్కు, బాధ్యత కూడా. శనివారం వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా మన ఫుడ్ సేఫ్గా ఉంటున్నదో లేదో తెలుసుకుందాం..

ఈ ప్రపంచంలో ప్రతీ పదిమందిలో ఒకరు సేఫ్ ఫుడ్ తీసుకోకనే జబ్బుల బారిన పడుతున్నారన్నది WHO రిపోర్ట్. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అన్నది మన బాధ్యత. ఆహార భద్రత , జాగ్రత్త ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతియేటా ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం పాటిస్తారు. 

తినే తిండి విషయంలో సింపుల్ లాజిక్ ఏంటంటే..మంచి తిండి తింటే ఆరోగ్యంగా ఉంటాం. తినేదాంట్లో మంచి పోషకాలు ఉంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరిగితే వైరస్, బ్యాక్టీరియాలను ఎదిరించొచ్చు.కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు మనం సేఫ్ ఫుడ్ తీసుకుంటున్నట్టే. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. మనం తీసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన భద్రతా చిట్కాలు.. 

  • చేతులు, పాత్రలు, మనం నివాసించే ప్రాంతాలను నిత్యం శుభ్రం చేసుకోవాలి. 
  • మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించి తినాలి. 
  • ఏదైనా ప్యాక్డ్ ఆహార పదార్థాలు వినియోగిస్తున్నపుడు లేబుల్స్ చెక్ చేసుకోవాలి. గడువు ముగిసిన ఆహారం తీసుకోవద్దు. 
  • బ్యాక్టీరియా పెరుగుదలను నివారించేందుకు మిగిలిపోయిన ఆహారపదార్థాలను 2గంటల్లోపు ఫ్రిజ్ లో నిల్వ చేయాలి. 
  • ముడి ఆహార పదార్థాలు , వండినవి వేర్వేరుగా ఉంచాలి. తినడానికి సిద్దంగా ఉన్న వస్తువులను పచ్చి మాంసం నుంచి దూరంగా ఉంచడం ఆహారా పదార్థాలు కలుషితం కాకుండా నివారించవచ్చు. 

►ALSO READ | Good Health : నీరసంగా ఉంటుందా.. ఈ 13 రకాల ఫ్రూట్స్ లో ఏదో ఒకటి తినండి లేదా జ్యూస్ తాగండి.. క్షణాల్లో శక్తి వస్తుంది..!

  • వంట చేసేముందు చేతులను ఇరవై సెకండ్లపాటు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నపుడు ఎప్పటికప్పుడు చేతులు కడుగుతూనే ఉండాలి. 
  • కూరగాయాలు కట్ చేసే చాకులు నేల, ప్లేట్లు ఏవైనా సరే శుభ్రంగా కడగాలి. 

2025 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం థీమ్..

2025 సంవత్సరానికి గాను ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం థీమ్ “Food Safety: Science in Action” ఆహార భద్రత-ఆచరణలో సైన్స్. మానవ ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు, వ్యవసాయం, మార్కెట్ యాక్సెస్, పర్యాటకం ,స్థిరమైన అభివృద్ధికి ఆహార భద్రత చాలా ముఖ్యమైనది. అసురక్షిత ఆహారం వల్ల కలిగే అనారోగ్యాలు ,మరణాలను నివారణ, ఆహార కాలుష్యాన్ని గుర్తించడం ,నిర్వహించడం గురించి అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. 

ఈ థీమ్, ఆహార భద్రతకు సైన్స్, ఆవిష్కరణలు ,సాంకేతికత కీలక పాత్రను నొక్కి చెబుతుంది. ఆహార కాలుష్యం,వ్యాధులను నివారించడంలో సైన్స్ ఎంత ముఖ్యమో ఈ థీమ్ తెలియజేస్తుంది. ఆహార భద్రత అనేది ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు, విక్రేతలు ,వినియోగదారులు అందరి ఉమ్మడి బాధ్యత అని కూడా ఈ రోజు గుర్తు చేస్తుంది.

చరిత్ర:

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2018 డిసెంబర్ 20న.. జూన్ 7ని ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా గుర్తించింది. మొదటిసారిగా 2019 జూన్ 7న ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ,ఆహార,వ్యవసాయ సంస్థ (FAO) లు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.