. < 1 minute
Tollywood: బ్యాంక్ జాబ్ మానేసి సినిమాల్లోకి.. 200 కోట్ల సినిమా హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోల్లో క్యూట్ గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ బ్యూటీ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. పేరుకు మలయాళీనే అయినా అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంటుంది. అదే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. అలాగనీ ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలేవీ చేయలేదు. తెలుగులో కేవలం రెండే రెండు సినిమాల్లో నటించింది. న్యాచురల్ స్టార్ నాని, టొవినో థామస్, కిరణ్ అబ్బవరం, షౌబిన్ షాహిర్, రోషన్ మాథ్యూ వంటి క్రేజీ హీరోలు, నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులో ఆమె నటించిన రెండో సినిమాయే ఏకంగా 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మలయాళంలో అయితే ఈ ముద్దుగుమ్మ కు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్. ఈ హీరోయిన్ నటించిన సినిమాలు చాలా ఈజీగా వంద కోట్ల వసూలు చేస్తాయి. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ మిస్ కేరళ ఫైనలిస్ట్ కూడా. ఇక సినిమాల్లోకి రాక ముందు ఈ ముద్దుగుమ్మ బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ను ఎంచుకుంది. బెంగళూరులోని ఓ ప్రముఖ బ్యాంక్ లో ఏడేళ్ల పాటు ఉద్యోగం చేసింది. అయితే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు కిరణ్ అబ్బవరం
క సినిమాలో నటించిన హీరోయిన్ తన్వీరామ్. అదేనండి మన హీరోతో కలిసి ఓ డార్క్ రూమ్ లో బంధీగా ఉంటుందిగా.. అది ఈమెనే.

తన్విరామ్ అసలు శ్రుతి రామ్. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది. చాలామందిలానే తను బాగా చదువుకుని బ్యాంక్ లో జాబ్​ తెచ్చుకుంది. అయితే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మలయాళంలో అంబులి, కప్పెల, 2018 వంటి సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

తన్వీ రామ్ గ్లామరస్ ఫొటోస్..

ఇక న్యాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది తన్వీరామ్. ఆ తర్వాత కిరణ్ అబ్బవరంతో కలిసి క సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

మలయాళంలో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు..

 

View this post on Instagram

 

A post shared by Tanvi Ram (@tanviram)

 

View this post on Instagram

 

A post shared by Tanvi Ram (@tanviram)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.