థగ్ లైఫ్ సినిమాతో శ్రుతిహాసన్ మాత్రమే కాదు, త్రిష అండ్ నయన్ కూడా యమాగా ట్రెండ్ అవుతున్నారు. శ్రుతి పాట పాడారు, ఆ పాట గురించి మాట్లాడారు కాబట్టి ట్రెండింగ్ ఓకే. త్రిష అందులో యాక్ట్ చేశారు కాబట్టి ఓకే. మరి నయనతార ప్రస్తావన ఎందుకొచ్చినట్టు.. కమాన్ లెట్స్ వాచ్…
థగ్ లైఫ్‌లో త్రిష షుగర్ బేబీ అంటూ స్టెప్పులేసిన తీరు చూసి, వింటేజ్ పొన్ను ఈజ్ బ్యాక్ అని అనుకున్నారు. ఎలాగూ గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ మీదున్నారు కదా… థగ్ లైఫ్ కూడా ఆ సక్సెస్ స్ట్రీక్‌ని కంటిన్యూ చేస్తుందని భావించారు జనాలు.
కాకపోతే అనుకున్నదొకటి అయ్యిందొకటి. థగ్ లైఫ్‌లో త్రిష రోల్ మీద ట్రోల్ స్టార్ట్ అయింది. కొన్ని సన్నివేశాల్లో త్రిష హద్దు మీద అందాల ప్రదర్శన చేశారనే టాక్ వైరల్ అవుతోంది. అంతే కాదు, ఈ సినిమాలో త్రిష రోల్ తీసేసినా కథా పరంగా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదనే మాటలూ వినిపిస్తున్నాయి.
మణిరత్నం థగ్ లైఫ్ కథ చెప్పగానే… కేరక్టర్ పేలవంగా ఉందని అర్థం చేసుకున్నారు కాబట్టే, ఈ సినిమా నుంచి నయనతార తప్పుకున్నారని అంటున్నారు నెటిజన్లు. సినిమా నుంచి క్విట్ అయి మంచి పని చేశారంటూ నయన్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.
ఒకప్పుడు నయన్‌కీ, త్రిషకీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేది. కానీ ఇప్పుడు ఇద్దరూ ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. వారిద్దరు కలిసి పోయినా, ఫ్యాన్స్ లో మాత్రం ఇంకా ఐకమత్యం రాలేదనే విషయం.. ఇప్పుడు త్రిషను నెగటివ్‌గా ట్రోల్ చేయడాన్ని బట్టి అర్థం అవుతోందంటున్నారు క్రిటిక్స్.