ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయతో తయారుచేసిన జ్యూస్ తాగడం వల్ల జ్ఞాపకశక్తి విపరీతంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయ రసంలో విటమిన్స్ తో పాటు మినరల్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. దీని కారణంగా జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా మెదడు మెరుగుపడుతుంది. ఉసిరి రసంలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని బలంగా మార్చుతుంది. ఉసిరి రసం తాగితే సీజనల్ ఇన్ఫెక్షన్ల రిస్క్ తగ్గుతుంది.
కొంతమందిలో ఉసిరి రసం తాగడం వల్ల చర్మ, జుట్టు సమస్యలు రాకుండా కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టును ఒత్తుగా పెంచడంలో ఉసిరి సాయపడుతుంది. ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల హెయిర్ ఫోలికల్స్ దృఢంగా మారుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.

ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల కాలేయం డీటాక్సిఫై అవుతుంది. ఉసిరి రసం తాగితే కాలేయ వాపు సమస్యలు తగ్గుతాయి. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. మార్నింగ్ ఉసిరి రసం తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. ఉసిరి రసంలో కొంచెం మిరియాల పొడి కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
భోజనం తర్వాత కూడా ఉసిరి రసం తాగవచ్చు. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. నిద్రకు ముందు ఉసిరి రసం తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఉసిరి తింటే చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీంతో ముడతలు తగ్గుతాయి.