
తెలుగులో మాస్ మాహారాజా రవితేజ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మాస్ యాక్షన్ అయినా.. లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. రవితేజ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో విక్రమార్కుడు ఒకటి. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయం అదరగొట్టారు. ఇప్పటికీ ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరోవైపు ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ చిత్రంలో ఉండే స్పెషల్ సాంగ్ అప్పట్లో యూత్ ను ఊర్రూతలూగించింది. వస్తావా.. వస్తావా.. ఒక్కసారి వస్తావా అంటూ సాగే ఈ పాటకు అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఇందులో కనిపించి హుషారైన స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించిన అమ్మాయి గుర్తుందా..?
ఒక్క స్పెషల్ పాటతోనే ఫేమస్ అయ్యింది. అచ్చతెలుగమ్మాయి.. ఆమె పేరు మేఘనా నాయుడు. విజయవాడకు చెందిన ఆమె.. చదువుల కోసం ముంబై వెళ్లింది. అదే సమయంలోనే యాక్టింగ్ వైపు మనసు మళ్లడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 18 ఏళ్ల వయసులోనే ప్రేమసాక్షి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ కాలేదు. దీంతో ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. తెలుగులో పృథ్వీ నారాయణ, వెండిమబ్బులు వంటి చిత్రాల్లో నటించింది.
తెలుగుతోపాటు హిందీ, బెంగాళీ, తమిళం, మలయాళీ చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయిన మేఘన.. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు విక్రమార్కుడు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ ఒక్కపాటతో విపరీతమైన క్రేజ్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. దీంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది. బాలకృష్ణ పాండు రంగడు, నాగ చైతన్య 100% లవ్, నాని పిల్ల జమీందార్ సినిమాల్లో ప్రత్యేకపాటలతో ఫేమస్ అయిన ఆమె.. 2016లో టెన్నిస్ ప్లేయర్ లూయిస్ మిగ్యుల్ రీస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్.
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..