. < 1 minute

Shambhala Review: సరికొత్త పాయింట్‌తో ఆది హారర్ థ్రిల్లర్.. ఉత్కంఠగా ‘శంబాల’ టీజర్

Caption of Image.

ఆది సాయి కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’.యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌‌ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.నేడు (జూన్ 7న) ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రిలీజైన శంభాలా టీజర్ ఉత్కంఠ కలిగిస్తోంది. 

ఇందులో జియో సైంటిస్ట్‌‌గా (భౌగోళిక శాస్త్రవేత్తగా) ఆది కనిపించాడు. టైటిల్కు తగ్గట్టుగానే టీజర్ ఆసక్తిరంగా సాగింది. మిస్టరీ, మేజిక్, మరియు మానవ విపత్తుల అంశాలను ప్రస్తావించి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు.

‘ఈ విశ్వంలో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్‌కు సమాధానం దొరకనప్పుడు వాటిని మూఢనమ్మకం అంటుంది. అదే సమాధానం దొరికితే అదే తన గొప్పతనం అంటుంది’ అనే డైలాగ్‌తో ఈ టీజ‌ర్ స్టార్ట్ అవుతుంది. అనంత‌రం ఆకాశం నుంచి ఒక ఉల్క లాంటి రాయి కిందికి వచ్చి ఒక ఊరిలో ప‌డుతుంది.

‘ఇది పంచభూతాలను శాసిస్తుందంటే.. సాధారణమైనది కాదు. దీన్ని ప్రభావం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో.. ఎవ్వరూ ఉహించలేరు’ అని సినిమా కాన్సెప్ట్ ను చూపించారు.

ఆ తర్వాత ఉల్క ప‌డిన క్షణం నుంచి ఆ ఊరి ప్రకృతిలో వచ్చే మార్పులు, వింత‌గా ప్ర‌వ‌ర్తించే ప్ర‌జ‌లు, ఆపై సంభవించే మరణాలు అన్నీను ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఇక వీటన్నిటీ వెనుక ఉన్న ర‌హస్యం ఏంటనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ ఇంట్రెస్ట్ కలిగించాయి. అందులో ఒక పోస్టర్ ను గమనిస్తే.. ‘ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖంతో భయం కలిగించేలా’ ఉన్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

ఇక ఇప్పుడు ఆ భయాన్ని, ఆసక్తిని టీజర్ మరింత పెంచింది. ఆదికి ఇది పర్ఫెక్ట్ సినిమా అయ్యేలా కనిపిస్తుంది. ఇందులో అర్చన అయ్యర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

డైరెక్టర్ యుగంధర్ విషయానికి వస్తే..  న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొందిన యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో శంభాల మూవీని రూపొందిస్తున్నాడు. .

సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌‌‌‌గా వస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్‌‌‌‌ మద్దూరి సంగీతం అందిస్తున్నాడు. డ్యూన్, ఇన్‌సెప్షన్, బ్యాట్ మాన్, డంకిర్క్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన హన్స్ జిమ్మర్ వంటి ప్రముఖ హాలీవుడ్ స్వరకర్తలతో శ్రీరామ్ మద్దూరి కలిసి పని చేశారు

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.