
లోకనాయకుడు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని రిలీజ్ కు ముందు ధీమా వ్యక్తం చేశాడు. అయితే తీరా థియేటర్లలో బొమ్మ పడ్డాక ఫలితం మరోలా మారింది. కర్ణాటక మినహా మిగతా ప్రాంతాల్లో గురువారం (జూన్ 5) థగ్ లైఫ్ సినిమా విడుదలైంది. అయితే ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కమల్ హాసన్, శింబుల నటన బాగున్నా సినిమా బోర్ కొట్టించిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై నెగెటివ్ పోస్టులు దర్శనమిస్తున్నాయి. మణిరత్నం తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో త్రిష, అభిరామి, నాజర్, జోజు జార్జ్ వంటి స్టారాది స్టార్స్ నటించారు. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు కమల్ హాసన్. అయితే ఇప్పుడీ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో కమల్‌తో పాటు ఆయన అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అయితే ఈ సినిమా వ్యవహారంలో మరో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే దుల్కర్ సల్మాన్, రవి మోహన్. దీనికి ఒక కారణం ఉంది.
అంతా అనుకున్నట్లు జరిగితే, దుల్కర్ సల్మాన్, రవి మోహన్ ‘థగ్ లైఫ్’ సినిమాలో నటించాల్సి ఉంది. ఈ సినిమాను 2023లో ప్రకటించారు. ఆ తరువాత దుల్కర్ సల్మాన్, రవి మోహన్ లకు కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. మొదట్లో వారు కూడా అంగీకరించారు. అయితే ఏమైందో తెలియదు కానీ తరువాత థగ్ లైఫ్ సినిమా నుంచి తప్పుకున్నారు.
డేట్స్ సరిపోకపోవడంతో దుల్కర్ సల్మాన్, రవి మోహన్ ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పట్లో చాలా మంది వారిని విమర్శించారు. దర్శకుడు మణిరత్నం, నటుడు కమల్ హాసన్ వంటి సీనియర్లతో కలిసి పనిచేసే అవకాశాన్ని దుల్కర్ సల్మాన్, రవి మోహన్ కోల్పోయారని విమర్శించారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిప్రాయం మారిపోయింది. దుల్కర్ సల్మాన్, రవి మోహన్ ఈ సినిమా నుంచి బయటకు రావడం మంచిదే అయ్యిందని ఆ హీరోల అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీని గురించి చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా కమల్ హాసన్ కన్నడ గురించి వివాదాస్పద ప్రకటన చేశారు. ఇది కన్నడిగులకు కోపం తెప్పించింది. ఫలితంగా, కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ విడుదలకు నోచుకోలేదు.
థగ్ లైఫ్ సినిమా నుంచి మధ్యలో తప్పుకున్న దుల్కర్ సల్మాన్..
#ThugLifeRules#Thuglife#KamalHaasan #SilambarasanTR
A #ManiRatnam Film
An @arrahman Musical@ikamalhaasan @SilambarasanTR_ #Mahendran @bagapath @trishtrashers @AishuL_ @AshokSelvan @abhiramiact @C_I_N_E_M_A_A #Nasser @manjrekarmahesh @TanikellaBharni #Vadivukkarasi… pic.twitter.com/UC1htARkPc— Raaj Kamal Films International (@RKFI) June 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..