. < 1 minute
Roshan Roshan Kanakalas Mowgli Teaser Is Out

ఫేమస్ యాంకర్ సుమ, ఆల్ రౌండర్ యాక్టర్ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల గురించి పరిచయం అక్కర్లేదు. తొలి చిత్రం ‘బబుల్ గమ్‌’ లో తన అద్భుతమైన నటనతో అలరించాడు. హీట్ విషయం పక్కన పెడితే యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ప్రజంట్ ‘మోగ్లీ 2025’లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై విజనరీ ప్రొడ్యూసర్ టి జి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Also Read : Dacoit : అడివి శేష్ థ్రిల్లర్ మూవీ ‘డెకాయిట్’ షూటీండ్ అప్‌డేట్..

సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా ఆరంగేట్రం చేస్తున్న ఈ చిత్రానికి, కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ట్రెండిగ్ రెస్పాన్స్ రాగా, ఈ గ్లింప్స్ రోషన్‌ను హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా మేకర్స్ మారేడుమిల్లిలో బిగ్ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి చేశారు. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌ లో మ్యాసీవ్ యాక్షన్ సీక్వెన్సలని షూట్ చేశారు. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో రోషన్ కనకాల చాలా రిస్క్ తీసుకుని యాక్షన్ స్టంట్స్‌ని పెర్ఫార్మ్ చేశారట. ఈ సీన్స్ సినిమాలో మేజర్ హైలెట్ గా ఉండబోతున్నాయి. మారేడుమిల్లిలో మూడో షెడ్యూల్‌ పూర్తి చేయగా, ఇంకొక్క షెడ్యూల్‌ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అంతే కాదు ఈ నెలలోనే టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.