. 2 minutes

OTT Movies: ఓటీటీల్లోకి మూడు కొత్త తెలుగు సినిమాలు..బ్లాక్‍బస్టర్ కామెడీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Caption of Image.

ఓటీటీల్లోకి గత మూడ్రోజుల్లో తెలుగులో నాలుగు కొత్త సినిమాలొచ్చాయి. వాటిలో తెలుగు ఆడియన్స్ను థియేటర్స్లో నవ్వుల్లో ముంచెత్తిన సినిమాలతో పాటుగా మాస్ యాక్షన్, రొమాంటిక్ జోనర్ సినిమాలు ఉన్నాయి.

ఈ సినిమాల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక వీటి ఓటీటీ సడెన్ ఎంట్రీతో.. ఇంట్లో వీకెండ్ సినిమాల సందడి మొదలైంది. మరి ఆ సినిమాలేంటీ? ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతున్నాయి? అనేది ఓ లుక్కేద్దాం.

సింగిల్:

శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూవీ శుక్రవారం (జూన్ 6న) ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో కామెడీ ప్రదానంగా సాగే సింగిల్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మే 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో రూ.14కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ సుమారు రూ.30కోట్లకి పైగా వసూళ్లను సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. 

ఇందులో శ్రీ విష్ణు ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న ప్రేమికుడిగా నటించాడు. కార్తీక్ రాజు మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు. వెన్నెల కిషోర్- శ్రీవిష్ణు మధ్య వచ్చే ఫన్నీ ఎపిసోడ్స్ తో మంచి బూస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆడియన్స్ కు ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు.

స్టార్ హీరోలను శ్రీవిష్ణు ఇమిటేట్ చేసే సీన్స్ అయితే, థియేటర్స్ లో మోత మోగిపోయేలా చేసింది. కామెడీతో పాటు ఎమోషన్, రొమాంటిక్ సీన్లతో వచ్చిన సింగిల్..ఈ వీకెండ్లో ఓటీటీ ఆడియన్స్ ను నవ్వించనుంది. ఎంచక్కా చూసేయండి. 

పెళ్లి కాని ప్రసాద్:

సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి గోపిడి తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’ (Pelli Kani Prasad). మార్చి 21న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేశాడు. అయితే, టీజర్, ట్రైలర్ లో చూపించిన స్టఫ్.. సినిమాలో లేకపోవడంతో అనుకున్న రేంజ్‍లో విజయం సాధించలేకపోయింది.

మల్లీశ్వరి మూవీలో వెంకటేష్ పాత్ర పేరుతో వచ్చిన ఈ పెళ్లి కాని ప్రసాద్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కూడా లేట్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

కథేంటంటే:

మలేషియాలోని ఓ స్టార్ హోటల్‌లో 38 ఏళ్ల ప్రసాద్ (సప్తగిరి) పని చేస్తుంటాడు. అతనికి వయస్సు పెరుగుతున్న పెళ్లి అవ్వదు. అందుకు కారణం తండ్రి (మురళీధర్ గౌడ్) కు ఉన్న కట్నం ఆశ. తమ పూర్వీకుల రెండు కోట్ల కట్నం చరిత్ర విని అంతకంటే తక్కువ కట్నం తీసుకుని పెళ్లి చేసుకోకూడదని చెప్తూ వస్తుంటాడు. ఇక ఆ మాటల కారణం చేత, ప్రసాద్ కి వయసు పెరుగుతున్న పెళ్లి అవ్వదు. దాంతో ఫ్రస్టేషన్‌లోకి వెళ్తాడు.

ఈ క్రమంలో ప్రియ (ప్రియాంక శర్మ) ఫ్యామిలీ మొత్తం ఓ ఎన్నారై సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలాగైనా ప్రసాద్ని ట్రాప్ చేసి, పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇక తన ఎత్తులతో తనను ప్రేమించేలా చేసుకుంటుంది. ఆపై ఇద్దరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే, మ్యారేజ్ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో ఫారెన్ వెళ్లకూడదని ప్రసాద్ ఫిక్స్ అవుతాడు. దాంతో ప్రసాద్ వర్సెస్ ప్రియగా మారుతారు. గొడవలు ముదురుతాయి.

పెళ్లి కాని ప్రసాద్ పెళ్లైకా ఎలాంటి కష్టాలను ఫేస్ చేసాడు? అసలు ప్రసాద్ పెళ్లి తర్వాత ఇండియాలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు? దానికి గల కారణం ఏంటీ? ప్రసాద్ కథ పెళ్ళాం చేతిలో మారిందా? మరింత నలిగిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

జాట్:

దర్శకుడు గోపీచంద్ మలినేని-హీరో సన్నీ డియోల్ జాట్ మూవీ జూన్ 5న స్ట్రీమింగ్కు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో జాట్ మూవీ హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. జాట్ మూవీని పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు గోపీచంద్ మలినేని.

ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రిలీజైన ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.120 కోట్లు వసూలు చేసింది. అయితే, ఈ మూవీ డైరెక్ట్ చేసింది తెలుగు దర్శకుడే ఐనా.. సినిమా మాత్రం హిందీలో రిలీజయింది.

జిగేల్:

త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వం వహించిన కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’.  మార్చి 7న థియేటర్స్ లో రిలీజైన ఈ మూవీ జూన్ 5న SUN NXTఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.