మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం తప్పకుండా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏలిన్నాటి శని కారణంగా ఖర్చులు పెరగడం, కొద్దిగా అనారోగ్యం చోటు చేసుకోవడం జరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో బంధువుల ప్రముఖుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సాగి పోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): లాభ స్థానంలో శనీశ్వరుడు, ధన స్థానంలో గురువు సంచారం కారణంగా ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గు ముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. దశమ స్థానంలో రాహువు సంచారం కారణంగా అధికారుల నుంచి ఆదరణ, సహోద్యోగుల నుంచి నిరాదరణ ఎదురవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. కుటుంబ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చవద్దు. మిత్రులకు సహాయం చేస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఇదే రాశిలో గురువు, లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్య మైన అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు పని భారం తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. రాశ్యధిపతి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): దశమ స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో రవి బుదుల సంచారం వల్ల ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నచిన్న చిరాకులు తలెత్తే అవకాశం ఉంది. తొందరపాటుతో వ్యవహరించడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. వ్యయ స్థానంలో గురువు సంచారం వల్ల శుభ కార్యాల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): భాగ్య స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి, బుధులు, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అష్టమ శని కారణంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. శ్రమ, తిప్పట కాస్తంత ఎక్కువగా ఉంటాయి. తోబుట్టువులతో ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక లావా దేవీలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంతో పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు భాగ్య స్థానంలో రవితో కలిసి ఉండడం, దశమ స్థానంలో గురువు సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆస్తి వివాదం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అష్టమ స్థానంలో శుక్ర సంచారం కారణంగా జీవిత భాగస్వామితో అపార్థాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆరవ స్థానంలో శనీశ్వరుడు, ఏడవ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు, భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి, లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు దశమంలో, రవి, బుధులు సప్తమ స్థానంలో సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. అధికారులకు బాగా సన్నిహితమయ్యే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభం కలుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నందువల్ల కెరీర్ పరంగా రాజ యోగాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పోటీదార్లపై పైచేయి సాధిస్తాయి. ఉద్యోగంలో ఊహించని పదోన్నతి లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నాలుగవ ఇంట శనీశ్వరుడి సంచారం వల్ల ఇంటాబయటా పని భారం, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. పంచమంలో శుక్రుడి సంచారం వల్ల చేపట్టిన పనులు, ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శనీశ్వరుడు తృతీయంలో, శుక్రుడు చతుర్థంలో, రవి, బుధులు పంచమంలో సంచారం వల్ల ఈ వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు. బంధువుల తోడ్పాటుతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కొన్ని పెండింగ్ పనుల్ని మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చతుర్థంలో బుధాదిత్య యోగం కలగడం, పంచమంలో గురువు సంచారం వల్ల ఉద్యోగంలో పదో న్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఏలిన్నాటి శని కారణంగా స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనవసర వాగ్వాదాలకు అవకాశం ఉంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ధన స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రవి, బుధులు, చతుర్థ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఉద్యోగంలో పని భారం బాగా పెరిగి విశ్రాంతి కరువవుతుంది. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో మిత్రుల సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి.