. 2 minutes

జంక్ ఫుడ్ తింటే స్ట్రెస్ పెరుగుతుందా..! ఇందులో నిజమెంత.. తగ్గేందుకు ఏం చేయాలి..?

Caption of Image.

సోషల్ మీడియా యుగంలో దాదాపు 90 శాతం యూత్ సఫర్ అవుతున్న ఏకైక ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే.. అది స్ట్రెస్ అని చెప్పవచ్చు. విలేజ్ లో నివసిస్తున్న వాళ్లలో ఈ సమస్య కొంత తక్కువగా ఉన్నా.. సిటీ లైఫ్ అనుభవిస్తున్న వాళ్లలో ఈ సమస్య కామన్. లైఫ్ స్టైల్ మారటం.. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగటం.. సోషల్ మీడియా అడిక్షన్.. ఫుడ్ హ్యాబిట్స్.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీజన్ తో ఒత్తిడికి గురవుతున్న వాళ్లే ఎక్కువ. 

సిటీ లైఫ్ లో ముఖ్యంగా జంక్ ఫుడ్ తినేవారే ఎక్కువ. ఇంట్లో వండుకునే అలవాట్లు తగ్గుతుండటం.. చిటికేస్తే ఇంటికే తెచ్చి ఇచ్చే డెలివరీ యాప్స్ ఉండటం.. రకరకాల వెరైటీస్ బయట దొరకటం.. వెరసీ బయట తినే వారి సంఖ్య చాలా ఎక్కువ అయిపోతోంది. ఎంతో కొంత హెల్త్ కాన్షియస్ నెస్ ఉన్న వాళ్లు కూడా అప్పుడప్పుడు జంక్ తినక ఉండలేని పరిస్థితి ఉంది. అయితే జంక్ ఫుడ్ తింటే స్ట్రెస్ పెరుగుతుంది అని కొందరు నమ్ముతుంటారు. నిజంగా జంక్ ఫుడ్ తో స్ట్రెస్ పెరుగుతుందా. ఒత్తిడి తగ్గించేందుకు ఏం చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

జంక్ ఫుడ్ అంటే: 

మనం తీసుకునే ఫుడ్ లో హై క్యాలరీస్, హై షుగర్స్, హై ఫ్యాట్స్ ఉండి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండే ఫుడ్ ను జంక్ ఫుడ్ అంటారు. అంటే బాడీకి అవసరం లేని లక్షణాలు ఎక్కువగా ఉండే ఫుడ్. ఎక్కువ శాతం ప్రాసెసింగ్ చేసిన ఈ ఫుడ్ న్యూట్రిషన్ వ్యాల్యూస్ లేకుండా ఉంటూ ఆరోగ్యానికి లాభం కంటే నష్టాలే ఎక్కువగా కలిగించే ఫుడ్ నే జంక్ ఫుడ్ అనవచ్చు. 

జంక్ ఫుడ్ లో షుగర్, సాల్ట్స్, ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండటం వలన బాడీ హార్మోనల్ బ్యాలెన్స్ ను ప్రభావితం చేస్తుంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచడం, గట్ హెల్త్ పై ప్రభావం చూపిస్తాయి. హార్మోన్స్, బ్లడ్ షుగర్ లెవల్స్, గట్ మనిషి మూడ్, స్ట్రెస్ ను ప్రభావితం చేస్తాయి. ఈ ఫుడ్ తిన్న తర్వాత తాత్కాలికంగా కంఫర్ట్, ఎనర్జీ ఇచ్చినప్పటికీ.. ఇర్రిటేషన్, తలనొప్పి, మూడ్ మారటం మొదలైన ఛేంజెస్ కు కారణం అవుతుంటుంది. జంక్ ఫుడ్ లో బాడీకి కావాల్సిన పూర్తి న్యూట్రిషన్స్ ఉండక పోవడం వలన బ్రెయిన్ కెమిస్ట్రీని ప్రభావితం చేసి బాడీ వీక్ నెస్ కు కారణమవుతుంది. ఇది స్ట్రెస్ కు దారి తీస్తుంది. 

మనవ శరీరంలో గట్ అంటే జీర్ణవ్యవస్థను సెకండ్ బ్రెయిన్ (రెండవ మెదడు) గా పిలుస్తుంటారు. ఎందుకంటే మెంటల్ హెల్త్ కు దీనికి సంబంధం ఉంటుంది. జంక్ ఫుడ్ లో ఫైబర్ లేకపోవడం, కృత్రిమంగా తయారు చేసిన పదార్థాలు ఉండటం వలన గట్ బ్యాక్టీరియాను నాషనం చేస్తాయి. దీంతో మూడ్ చేంజ్ అయ్యే న్యూరో ట్రాన్స్ మిటర్స్ విడుదల ఆగిపోతుంది. ఇది స్ట్రెస్ కు దారి తీస్తుంది. 

ఇక జంక్ ఫుడ్ తినటం వలన మెదడు కొంతగా వాపుకు గురవుతుందట. దీంతో బ్రెయిన్ ఫంక్షనింగ్ దెబ్బతినటంతో పాటు స్ట్రెస్ ను మేనేజ్ చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుందట. జంక్ ఫుడ్ వలన కార్టిసోల్ అంటే స్ట్రెస్ హార్మోన్ తో పాటు ఇన్సులిన్ విడుదలపై ప్రభావం చూపుతుంది. ఇది స్ట్రెస్, టెన్షన్స్ కు దారితీస్తుంది. 

జంక్ ఫుడ్ తినటం వలన శరీరానికి, మెదడుకు కావాల్సిన న్యూట్రిషియెంట్స్ అబ్సార్బ్ చేసుకోవడం మందగిస్తుంది. దీంతో మెగ్నీషియం, బి విటమిన్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, న్యూట్రిషియెంట్స్ అందటం తగ్గిపోతుంది. వీటి వలన బాడీలో చాలా మార్పులు వస్తుంటాయి. స్ట్రెస్ పెరిగిపోతుంది. 

జంక్ ఫుడ్ వలన నిద్రపై చాలా ప్రభావం చూపుతుంది. నిద్ర లేకపోవటం వలన యాంక్జైటీ, అలసట, ఇరిటేషన్, స్ట్రెస్ మొదలైనవి పెరుగుతాయి. ఇక రెగ్యులర్ గా జంక్ ఫుడ్ తీసుకోవడం వలన ఎమోషనల్ ఈటింగ్ పెరుతుందట. అంటే ఇంటి దగ్గర ఫుడ్ ఉన్నప్పటికీ.. ఫేవరెట్ అనో.. ఇంట్లో తినాలని లేదనో.. ఫ్రెండ్స్ వచ్చారనో ఏదో ఒక వంకతో జంక్ ఫుడ్ తినేస్తారట. మనకు తెలియకుండానే దానికి అలవాటు పడిపోతామాని.. అది ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా స్ట్రెస్ పెంచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. 

జంక్ ఫుడ్ లో యాంటీ యాక్సిడెంల్స్ తక్కువగా ఉండటమే కాకుండా.. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను పెంచుతుందట. అలాగే డోపమైన్ రిలీజ్ ఎక్కువ అవుతుందట. డోపమైన్ ను ఫీల్ గుడ్ హార్మోన్ అంటుంటారు. డోపమైన్ ఎక్కువ కావటం వలన ఎప్పుడు అంచనాలకు పైగా ఆనందాన్ని కోరుకుంటుంది. ఫుడ్ విషయంలో కూడా అంచనాలకు మించిన రుచిని, సంతృప్తిని కోరుకుంటుంది. అది మిస్ అయితే ఏదో తెలియని ఆందోళన మొదలై దారుణమైన స్ట్రెస్ కు గురవుతామని న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు. 

అందుకే రుచి, స్మెల్, కలర్ లాంటి వాటికి అట్రాక్ట్ అయ్యి ఎప్పుడూ ఏదో ఒక వంకతో బయటి ఫుడ్ తినేయకండి. తినే ముందు ఈ పాయింట్స్ ఒకసారి గుర్తు చేసుకోండి. జంక్ ఫుడ్ తగ్గించి ఫైబర్, మినరల్ రిచ్ ఫుడ్ తినటం వలన బాడీ బ్యాలెన్స్ డ్ గా ఉంటూ.. స్ట్రెస్ నుంచి దూరం చేస్తుందని.. హ్యాపీ లైఫ్ కోసం కొన్ని పాటించాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.