. < 1 minute

వివేక్ వెంకటస్వామి అనే నేను.. మంత్రిగా ప్రమాణ స్వీకారం

Caption of Image.

 చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గడ్డం వివేక్ వెంకటస్వామి అనే నేను.. అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వివేక్ వెంటకస్వామితో.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వివేక్ వెంకటస్వామి.. తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపైనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు అడ్లూరు లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, గవర్నర్ పలువురు మంత్రులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు కాంగ్రెస్​ అధిష్టానం సముచిత గౌరవం కల్పించింది.  ప్రముఖ  కాంగ్రెస్​నేత, మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి (కాకా),  కళావతి దంపతుల చిన్న కొడుకు వివేక్ వెంకటస్వామి. ఆయన బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌‌‌‌లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో  ఎంబీబీఎస్​ చదివారు. ఆదినుంచీ ప్రజా సేవలో పాతుకుపోయిన కుటుంబంలో పెరిగిన వివేక్.. ఏ పదవిలో ఉన్నా సమాజం పట్ల బలమైన బాధ్యతను పెంచుకున్నారు.  తండ్రి గడ్డం వెంకటస్వామి (కాకా) బాటలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 

2009లో రాజకీయ ప్రస్థానం మొదలు

తండ్రి కాకా వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి  పెద్దపల్లి లోక్​సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009 నుంచి2014  మధ్య 15వ లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో తెలంగాణను అడ్డుకుంటున్నారనే కారణంతో అప్పటి సీఎం కిరణ్​కుమార్​రెడ్డిని ధిక్కరించి, ఢిల్లీ కేంద్రంగా మిగిలిన ఎంపీలతో కలిసి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ధర్నాలు, రైలు రోకోల్లో పాల్గొని, అరెస్టయ్యారు. వీ 6 చానల్​ ను ప్రారంభించి, ఉద్యమ ఆకాంక్షను జనంలోకి తీసుకెళ్లారు
 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.