. 2 minutes

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే!

Caption of Image.

కిడ్నాప్‌‌‌‌  చేసిందెవరు? 

టైటిల్ : స్టోలెన్
ప్లాట్​ ఫాం : అమెజాన్‌‌‌‌  ప్రైమ్ వీడియో
డైరెక్షన్ :  కరణ్ తేజ్‌‌‌‌పాల్
కాస్ట్​ : అభిషేక్ బెనర్జీ, శుభమ్ వర్ధన్, మియా మెల్జర్

గౌతమ్ బన్సాల్ (అభిషేక్ బెనర్జీ) తన సోదరుడు రామన్ బన్సాల్ అలియాస్ రాంబో (శుభమ్ వర్ధన్)ను రిసీవ్‌‌‌‌ చేసుకోవడానికి కుంబా రైల్వే స్టేషన్‌‌‌‌కు వెళ్తాడు. ఆ మరుసటి రోజు వాళ్ల ఇంట్లో ఒక ముఖ్యమైన శుభకార్యం జరుగుతుండడంతో.. దానికి హాజరయ్యేందుకు రామన్ వస్తాడు. అతను రైలు దిగినప్పుడే ఒక కిడ్నాపర్ ఝుంప (మియా మేల్జర్) అనే గిరిజన మహిళ దగ్గర నుంచి తన  ఐదు నెలల కూతురు చంపాని తీసుకుని పారిపోతాడు. 

వెళ్లేటప్పుడు అతడు రామన్‌‌‌‌ను ఢీకొడతాడు. దాంతో ఝుంప తన బిడ్డ కిడ్నాప్‌‌‌‌లో రామన్‌‌‌‌ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తుంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, రామన్‌‌‌‌ను విచారిస్తారు. చివరకు ఆ కిడ్నాప్‌‌‌‌తో రామన్‌‌‌‌కు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకుంటారు. ఆ తర్వాత కిడ్నాపర్‌‌‌‌‌‌‌‌ ఓ కోటలో దాక్కున్నాడని తెలుస్తుంది. కానీ.. పోలీసులు ఆ ప్లేస్‌‌‌‌కి వెళ్లలేకపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. 

షాలుది హత్యా? 

టైటిల్ : ఛల్ కపట్
ప్లాట్​ ఫాం : జీ5
డైరెక్షన్ : అజయ్‌‌‌‌భుయాన్‌‌‌‌
కాస్ట్​ : శ్రియా పిల్గావ్‌‌‌‌కర్, స్మరన్ సాహు, తుహినా దాస్, రాగిణి ద్వివేది, యాహ్వే శర్మ, అనుజ్ సచ్‌‌‌‌దేవా, కేశవ్ లోక్వాని,  కామ్యా అహ్లవత్​ 

జుగల్ (స్మరన్ సాహు), అలీషా (కామ్య అహ్లవత్)ల నిశ్చితార్థానికి పెద్దలు ముహూర్తం ఫిక్స్‌‌‌‌ చేస్తారు. ఆ ఈవెంట్‌‌‌‌ అలీషా పూర్వీకుల హవేలీ(ప్రైవేట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌)లో జరుగుతుంది. దానికి తన చిన్ననాటి స్నేహితులు ఇరా (తుహినా దాస్), మెహక్ (రాగిణి ద్వివేది), షాలు (యాహ్వేశర్మ)ని పిలుస్తుంది. మెహక్‌‌‌‌తోపాటు ఆమె భర్త విక్రమ్ (అనుజ్ సచ్‌‌‌‌దేవా)వెళ్తాడు. ఇరా మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్న తన బిడ్డతో వెళ్తుంది. 

సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్ షాలు తనకు హెల్ప్‌‌‌‌ చేయడానికి సపన్ (కేశవ్ లోక్వాని)ని వెంట తీసుకెళ్తుంది. ఇలా అందరూ హవేలీకి చేరుకుంటారు. ఆ మరుసటి రోజు పక్కనే ఉన్న ఒక చెరువులో షాలు మృతదేహం కనిపిస్తుంది. విక్రమ్ తన పలుకుబడితో కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి పెంచుతాడు. ఆ ఏరియాకు కొత్తగా వచ్చిన పోలీసు సూపరింటెండెంట్ దేవిక రాథోడ్ (శ్రియా పిల్గావ్‌‌‌‌కర్) దర్యాప్తు మొదలుపెడుతుంది. తొమ్మిది మంది అనుమానితులను అరెస్ట్‌‌‌‌ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? షాలు చావుకి కారణమేంటి? తెలియాలంటే ఈ వెబ్‌‌‌‌సిరీస్‌‌‌‌ చూడాలి. 

చదువు కోసం బాక్సింగ్​!

టైటిల్ : అలప్పుళ జింఖానా, ప్లాట్​ ఫాం : సోనీ లివ్​ 
డైరెక్షన్ :  ఖలీద్ రెహమాన్
కాస్ట్​ : నస్లెన్, లుక్మాన్ అవరన్
గణపతి, సందీప్ ప్రదీప్, అనఘా రవి, కొట్టాయం నజీర్, ఆబిష్ రెహమాన్, శివ హరిహరన్ 

ఐదుగురు కుర్రాళ్లు షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్), డేవిడ్ జాన్ (ఆబిష్ రెహమాన్), జోజో జాన్సన్ (నాస్లెన్), షానవాస్ కెఎల్ (శివ హరిహరన్) పన్నెండో తరగతి పరీక్షలు రాసి, రిజల్ట్‌‌‌‌ కోసం వెయిట్‌‌‌‌ చేస్తుంటారు. రిజల్ట్స్‌‌‌‌ వచ్చేరోజు ఒక టేబుల్ చుట్టూ గుమిగూడి, మధ్యలో కల్లు కుండని పెట్టుకుంటారు. పాసైనా, ఫెయిల్ అయినా తాగడమే వాళ్ల పని. రిజల్ట్స్‌‌‌‌ చూసుకుంటే షానవాస్ తప్ప మిగతావాళ్లంతా ఫెయిల్ అవుతారు. 

►ALSO READ | జులైలో ‘సోలో బాయ్’ … పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేసిన మూవీ టీం

పై చదువులకు వెళ్లాలంటే వాళ్ల ముందున్న మార్గం ఒకటే.. స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో చేరడం. అందుకే గ్రేస్ మార్కులు సాధించడానికి బాక్సింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. దాంతో వాళ్లంతా బాక్సర్లుగా మారడానికి ట్రైనింగ్‌‌‌‌ తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది. బాక్సింగ్‌‌‌‌ పోటీల్లో గెలిచి కాలేజీలో చేరారా? లేదా? అనేది మిగతా కథ. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.