. 2 minutes

Youtuber క్రియేటివిటి : సంప్రదాయమైన వంటలనే.. మినియేచర్ స్టయిల్ లో.. సేవ చేస్తూ.. సెలబ్రేట్..!

Caption of Image.

చెప్పేది పాత విషయమే అయినా కొత్తగా చెప్పగలిగితే చాలామంది కనెక్ట్‌‌‌‌ అవుతారు. అందుకే అందరికీ తెలిసిన సంప్రదాయ వంటలనే మినియేచర్‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌లో చేస్తూ.. ఎంతోమందికి దగ్గరయ్యారు ఈ అన్నాచెల్లెళ్లు. పెద్దలతోపాటు పిల్లలకు ఆసక్తి కలిగించేలా చిన్న చిన్న పాత్రల్లో ఆరోగ్యకరమైన వంటలు చేస్తూ.. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. 

చెన్నైకి చెందిన శరవణన్, రంజిత అన్నాచెల్లెళ్లు. ఇద్దరూ కలిసి 2018లో ‘మినియేచర్ కుకింగ్ షో’ పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టారు. మినియేచర్ కిచెన్‌‌‌‌లో నోరూరించే వంటకాలు తయారు చేసి ఆ వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తున్నారు. ‘‘వంట అనేది అందరూ కచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక స్కిల్‌‌‌‌. ఆ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికే ఇలా మినియేచర్‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌లో వీడియోలు చేస్తున్నాం. మేము వీడియోల్లో ఉపయోగించిన గిన్నెలు, వస్తువులు పిల్లల దృష్టిని ఆకర్షిస్తాయి. దానివల్ల వాటి గురించి తెలుసుకుంటారు. వాళ్లలో వంట నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది” అంటున్నాడు ఓ ఐటీ సంస్థలో విజువల్ డిజైనర్‌‌‌‌గా పనిచేస్తూ.. యూట్యూబ్‌‌‌‌ చానెల్‌‌‌‌ నడుతుపుతున్న శరవణన్. ఇప్పుడు చానెల్‌‌‌‌ కోసం అతని భార్య కూడా పనిచేస్తోంది. 

సేవ చేస్తూ.. సెలబ్రేట్‌‌‌‌

చానెల్‌‌‌‌ ఒక్కో మైలురాయిని దాటిన ప్రతిసారి వాళ్లు సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇచ్చేలా ప్లాన్‌‌‌‌ చేశారు. ఉదాహరణకు 50వ వీడియో తర్వాత వాళ్లు ఒక అనాథాశ్రమంలో దాదాపు 200 మంది పిల్లలకు చికెన్ బిర్యానీ, కర్రీ వండి పెట్టారు. 120వ వీడియో తర్వాత మరో సేవా కార్యక్రమం చేశారు. ‘‘నేను కొన్నాళ్ల క్రితం చాలా రీసెర్చ్‌‌‌‌ చేసి ఆకలి చావుల గురించి తెలుసుకున్నా. వ్యాధులతో చనిపోయేవాళ్ల కంటే ఆకలితో చనిపోయేవాళ్లే ఎక్కువని అర్థమైంది. అందుకే వీడియో చేసిన ప్రతిసారి మేము కనీసం ఇద్దరుముగ్గురికి ఫుడ్‌‌‌‌ డొనేట్​ చేస్తున్నాం” అంటున్నాడు శరవణన్.

పదేళ్ల వయసులో..

రంజిత తన పదేళ్ల వయసులోనే వంట చేయడం మొదలుపెట్టింది. వాళ్ల అమ్మ ఒక టైలరింగ్ యూనిట్ నడిపేది. దాంతో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు వెళ్లి, చీకటి పడ్డాక ఇంటికి వచ్చేది. పిల్లల కోసం ఉదయం భోజనం వండి పెట్టేది. కానీ.. వాళ్లకు మధ్యలో ఏదైనా తినాలి అనిపిస్తే.. రంజిత ఏదో ఒకటి వండేది. అలా ఆమెకు వంట చేయడం అలవాటైంది. ఇప్పుడు కూడా తన అన్నలాగే ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్‌‌‌‌లో వీడియోలు చేస్తుంటుంది. 

బొమ్మల దుకాణాల్లో 

వీడియోల కోసం కావల్సిన చిన్న చిన్న వస్తువులను బొమ్మల దుకాణాల్లో కొన్నారు. మరికొన్ని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కొన్నారు. వంట చేయడం మాత్రమే కాదు… ఏ పాత్రల్లో వండినవి తింటే ఆరోగ్యంగా ఉంటామో అందరికీ చెప్తున్నారు. అందుకే మొదట్లో వాళ్ల ఊళ్లోని ఒక కుమ్మరి ప్రత్యేకంగా తయారుచేసిన చిన్న మట్టి పాత్రలను మాత్రమే ఉపయోగించారు. వీటిలో కూరలు, బిర్యానీల్లాంటివి చేయొచ్చు. కానీ.. దోసె, గులాబ్ జామున్‌‌‌‌ లాంటివి చేయలేకపోయారు. 

అందుకే ఇత్తడి, సిల్వర్‌‌‌‌తో తయారు చేసిన సంప్రదాయ వంట సామాగ్రిని సమకూర్చుకున్నారు. రంజిత వంట చేస్తుంటే శరవణన్ వీడియోలు షూట్ చేసి, ఎడిట్ చేస్తుంటాడు. వాళ్లు చేసిన వెజిటేరియన్ థాలీ, చికెన్ డ్రమ్ స్టిక్, సమోసా వీడియోలు బాగా పేరు తీసుకొచ్చాయి. పిల్లల్ని ఆకట్టుకోవడానికి వాళ్ల రెసిపీలకు మోటుపత్లు లాంటి ప్రసిద్ధ కార్టూన్ పాత్రల పేర్లు కూడా పెడుతుంటారు. 

విలేజ్ లైఫ్‌‌‌‌

వీడియోల్లో ఎక్కువగా విలేజ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ కనిపిస్తుంటుంది. అందుకోసం వాళ్లు ఆవుల బొమ్మలు, గడ్డి, గుడిసె, ఓపెన్‌‌‌‌ కిచెన్‌‌‌‌ లాంటివి ఏర్పాటు చేస్తుంటారు. ఇండోర్ షూటింగ్ సెటప్‌‌‌‌ కూడా ఉంది.  అందులో చిన్న చాపింగ్ బోర్డులు, టేబుల్‌‌‌‌టాప్‌‌‌‌లు, స్టూల్స్ లాంటివి ఉన్నాయి. అయితే.. వాటితో వీడియోలు తీయడం మొదలుపెట్టిన కొత్తలో  చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. సరైన అవుట్‌‌‌‌పుట్‌‌‌‌ కోసం చాలాసార్లు షూటింగ్‌‌‌‌ చేసేవాళ్లు. 

మినియేచర్ ఎందుకు? 

రంజితకు చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం, బొమ్మలకు బట్టలు కుట్టడం లాంటి పనులంటే ఇష్టం. అందుకే మినియేచర్‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌ వీడియోలు చేయాలని నిర్ణయించుకుంది. ‘‘ఒక రోజు నా నిర్ణయాన్ని శరవణన్‌‌‌‌తో చెప్పాను. అప్పటినుంచి ఇద్దరం కలిసి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రీసెర్చ్‌‌‌‌ చేయడం మొదలుపెట్టాం. అప్పటికే కొందరు ఫారినర్స్‌‌‌‌ మినియేచర్‌‌‌‌‌‌‌‌ కుకింగ్‌‌‌‌ వీడియోలు చేస్తున్నారు. కానీ.. ఇండియాలో దీనిగురించి చాలామందికి తెలియదు. కాబట్టి అందరికీ పరిచయం చేయాలని చానెల్‌‌‌‌ పెట్టాం’’ అని చెప్పింది రంజిత.

సబ్‌‌‌‌స్క్రయిబర్స్ తక్కువే!

డిఫరెంట్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌తో వీడియోలు చేస్తున్నా చానెల్‌‌‌‌కు సబ్‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య పెద్దగా పెరగలేదు. పైగా కొన్నాళ్ల నుంచి ఈ అన్నాచెల్లెళ్లు వీడియోలు కూడా ఎక్కువగా అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయడం లేదు. ప్రస్తుతం చానెల్‌‌‌‌కు 2 లక్షల 23 వేల మంది సబ్‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. అయినా ‘మోటుపత్లు సమోస రెసిపీ’ పేరుతో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసిన వీడియోకు ఏకంగా 22 మిలియన్ల వ్యూస్‌‌‌‌ వచ్చాయి. ఇక మిలియన్‌‌‌‌ వ్యూస్‌‌‌‌ దాటిన వీడియోలు చానెల్‌‌‌‌లో చాలానే ఉన్నాయి. 

షార్ట్ వీడియోలకు కూడా వ్యూస్‌‌‌‌ బాగానే వస్తున్నాయి. అయితే.. యూట్యూబ్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌తో పోలిస్తే.. ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో వీళ్లకు ఫాలోయింగ్‌‌‌‌ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే 6 లక్షల మంది 87 వేలమంది ఫాలో అవుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.