
భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో మంది స్టార్ హీరోయిన్లను అందించిన మంగళూరు నుంచే ఈ ముద్దుగుమ్మ కూడా పుట్టుకొచ్చింది. కానీ ఎక్కువగా ముంబైలో పెరిగింది. 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషా చిత్రాల్లో నటించింది. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ క్లాసికల్ డ్యాన్సర్. భరతనాట్యంలో శిక్షణ పొందింది. అలాగే కరాటేలో బ్లాక్ బెల్ట్ ఛాంపియన్ కూడా. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ వయసు 49 ఏళ్లు. అయినా అదే అందం, క్రేజ్. ఈ బ్యూటీకి నేటికీ డిమాండ్ ఉంది. ఫిట్నెస్ పరంగా ఆమె అందరికీ రోల్ మోడల్. ఇక ఎప్పటి నుంచో సినిమాలు చేస్తోన్న ఈ మంగళూరు బ్యూటీకి వేలాది కోట్ల ఆస్తులున్నాయి. ఇప్పటికీ నటిగా ఓ వెలుగు వెలుగుతోన్న ఈ సొగసరి ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు శిల్పా శెట్టి. ఆదివారం (జూన్ 08) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ బ్యూటీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
తన పుట్టిన రోజును పురస్కరించుకుని శిల్పా శెట్టి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. చిన్నప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా తాను ఎదిగిన తీరును మరోసారి గుర్తుచేసుకుంది.ఈ సందర్భంగా వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలను అందరితో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసి నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. శిల్పా శెట్టికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
శిల్పా శెట్టి షేర్ చేసిన వీడియో..
శిల్పా శెట్టి బాలీవుడ్లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ సాహస వీరుడు సాగర కన్య, ఆజాద్,వీడెవడండి బాబూ తదితర సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఆమె ధ్రువ సర్జా ‘కెడి’ సినిమాలో సత్యవతి పాత్రను పోషిస్తోంది. శిల్పా శెట్టి పుట్టినరోజు సందర్భంగా, ‘కెడి’ చిత్ర బృందం సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శిల్పా శెట్టికి ఇప్పుడు సుమారు 49 సంవత్సరాలు.అందం, ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోందీ అందాల తార.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..