
అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన కోతులు.. ఈ మధ్య జనావాసాల్లో విచ్చల విడిగా సంచరిస్తున్నాయి. తెలంగాణ పల్లెల్లో అయితే ఎక్కడ చూసిన వానరమూకలే దర్శనమిస్తున్నాయి. గుంపులు గుంపులుగా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అధ్యాత్మిక ప్రాంతాల్లో భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాటిని తరిమిందేకు ప్రయత్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నాయి.
తెలంగాణ పల్లెల్లో కోతుల వీరంగం సృష్టిస్తున్నాయి. రోజురోజుకు కోతుల సంఖ్య పెరిగిపోతుంది. చాలా గ్రామాలు కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నాయి. అయితే. కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు కొండముచ్చులను రంగంలోకి దింపారు. కొండముచ్చు కనబడుతే చాలు.. కోతులు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు కొండముచ్చులు.. స్థానికులతో మంచి స్నేహితులుగా మారిపోతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా గ్రామాల్లో కోతుల బెడద ఉంది. గ్రానైట్ తవ్వకాల కారణంగా.. కోతులన్నీ గ్రామాల్లోకి వచ్చి చేరిపోతున్నారు. ఆటవీ సంపద కూడా అంతరించిపోతుంది. దీంతో ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చి చేరుతున్నాయి. స్థానికుల జనాభా కంటే, కోతుల జనాభానే అధికంగా ఉంది. తిండి కోసం జనం పై దాడి చేస్తున్నాయి. వరి మినహా.. అన్ని రకాల పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నారు. పంటలు వేసుకుందామంటే.. రైతులు భయపడుతున్నారు.
గుంపులు గుంపులుగా వచ్చి కోతుల రణరంగం సృష్టిస్తున్నాయి. అయితే ముల్లును ముల్లును తీయాలనే.. సామెత ప్రకారం.. కోతులకు చెక్ పెట్టేందుకు కొండముచ్చులను రంగంలోకి దింపారు అధికారులు. సహజంగానే కొండముచ్చులకు కోతులకు పడదు. కొండముచ్చును చూడగానే.. కోతులు పరుగులు తీస్తున్నాయి. కొండముచ్చులను 40 వేల రూపాయలకు పైగా కొనుగోలు చేసి, గ్రామంలోతిప్పుతున్నారు. ఇందుకోసం ఏకంగా ఓ గ్రామ సిబ్బందిని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో కొండముచ్చుకు షెల్టర్ ఇచ్చి, కావాల్సిన ఆహారం పెడుతున్నారు.
తిమ్మాపూర్ మండలం కేంద్రంలో కొండముచ్చులను గ్రామంలో తిప్పుతున్నారు. ఇక్కడ ఉన్న కోతులు.. కొండముచ్చు రాగానే.. కోతులు భయంతో పరుగులు తీస్తున్నాయి. చాలా రోజుల నుంచి గ్రామాల్లో ఉండిపోవడంతో స్థానికులకు కొండముచ్చులు ఫ్రెండ్ లాగా మారిపోయాయి. అందరితో చనువుగా ఉంటున్నాయి. స్థానికులతో ఆడుకుంటున్నాయి. అంతేకాదు.. బైక్‌పై దర్జాగా కూర్చుకొంటూ చక్కర్లు కొడుతున్నాయి. బైక్‌పై తిరుగుతూ.. నేను ఉన్నానని అంటూ.. కోతులకు హెచ్చరిక చేస్తుంది. ప్రతి రోజు ఉదయం రెండు గంటలు.. సాయంత్రం రెండు గంటలు ఊరు మొత్తం.. కొండముచ్చును తిప్పుతున్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది.
అంతేకాదు.. పంట పొలాల దగ్గరికి కూడా తీసుకెళ్తున్నారు. పంట పొలాల వద్ద కొండముచ్చు ఉంటే.. కోతులు పరుగులు తీయాల్సిందే. కొండముచ్చుల కారణంగా చాలా గ్రామాల్లో కోతుల బెడద తగ్గింది. దీంతో కొండముచ్చును తమ గ్రామ జంతువుగానే చూస్తున్నారు. గ్రామస్తులు వివిధ పండ్లు అందిస్తున్నారు. కొండముచ్చును ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు స్థానికులు. మొత్తానికి కొండముచ్చుల భయానికి కోతులు పరుగులు తీస్తున్నాయి.
తమ గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉండేదని స్థానికులు అంటున్నారు. వందల సంఖ్యలో కోతులు తిరుగుతూ.. ఇంట్లోకి వచ్చి నేరుగా ఆహారం ఎత్తుకెళ్తున్నాయని చెబుతున్నారు. కొండముచ్చు వచ్చిన తరువాత ఈ బెడద పూర్తిగా తగ్గిందని తెలుపుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..