. < 1 minute

ఫ్లెక్సీలో ఎంపీ వంశీ ఫోటో పెట్టలేదని..కాంగ్రెస్ నేతల ఆందోళన

Caption of Image.

 కాళేశ్వరం  సరస్వతీ పుష్కరాల్లో ఉద్రిక్తత నెలకొంది. దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించారని ఆందోళన చేశారు కాంగ్రెస్ నాయకులు.  కాలేశ్వరం సరస్వతి పుష్కరాల ఫ్లెక్సీ ల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో పెట్టలేదని నిరసన తెలిపారు. సీఎం సభ ముందే ప్లకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేశారు. దళిత ఎంపీ అని అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకున్న  పోలీసులు  కాంగ్రెస్ లీడర్లపై చేయి చేసుకున్నారు.  నిరసన తెలిపిన కాంగ్రెస్ లీడర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఫొటోలు కనిపించలేదు.  సొంత పార్టీకి చెందిన దళిత ఎంపీని విస్మరించడంపై కాంగ్రెస్‌‌‌‌ పార్టీ లోకల్‌‌‌‌ లీడర్లు మండిపడుతున్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పెద్దపల్లి ఎంపీ పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వ నిధులతో జరిపే ఏ కార్యక్రమంలో అయినా ప్రొటోకాల్‌‌‌‌ ప్రకారం పార్టీలకు అతీతంగా ఎంపీ ఫొటోలు, పేర్లు పెట్టాల్సి ఉంటుంది. 

అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న పుష్కరాల్లో ఎంపీ పేరు, ఫొటో కన్పించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు, మరో ముగ్గురు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌‌‌‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఫ్లెక్సీలో ఉన్నాయి. కానీ, పుష్కరాలతో సంబంధం ఉన్న లోకల్ ఎంపీ వంశీకృష్ణ ఫొటోగానీ, పేరు గానీ లేదు. 3 రోజుల కిందే ఎంపీ వంశీకృష్ణ కాళేశ్వరంలో పర్యటించి, ప్రభుత్వం తరఫున చేపట్టిన పుష్కరాల పనులను పరిశీలించారు. ఈ పుష్కరాలకు  ప్రధాని మోదీని కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. అయినా.. మరీ పనిగట్టుకొని ఎంపీ వంశీకృష్ణ ఫొటోనే పెట్టకపోవడంలో ఆంతర్యం ఏంటని స్థానిక దళిత నేతలు ప్రశ్నిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.