
అందాల నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టాప్ హీరోయిన్ గా మారింది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఎన్నో దశాబ్దాలుగా అనేక చిత్రాల్లో నటించిన మీనా.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికీ అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో వెండితెరపై మాయ చేస్తుంది మీనా. 1976 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించిన మీనా… చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి కోట్లాది మంది హృదాయాలను గెలుచుకుంది. ఇప్పటికీ సీనియర్ హీరోలకు జోడిగా వరుస సినిమాలు చేస్తుంది. అలాగే యంగ్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది.
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంది మీనా. వీరికి 2011లో నైనికా అనే అమ్మాయి జన్మించింది. కొన్ని సంవత్సరాల క్రితం మీనా భర్త పలు అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన కూతురు నైనికా, కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మీనా కూతురి వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో అందంలో అచ్చం తల్లిలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మీనా కూతురు ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ దళపతి హీరోగా నటించిన పోలీసోడు చిత్రంలో అతడి కూతురిగా నటించింది నైనిక. ఆ తర్వాత భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంలో అరవింద్ స్వామితో నటించింది. ఇక ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ తన కూతురి ఫోటోస్ అప్పుడప్పుడు నెట్టింట పంచుకుంటుంది మీనా.
Timeless friendship
#Meena pic.twitter.com/r0jKMpgquE
— Meena (@ActressMeena_) June 6, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..