
ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నారు. అయితే కమల్ జీవితంలో ప్రేమకు ఎప్పుడూ అంతం లేదు. ఈయన తన కెరీర్ బిగినింగ్‌లో ఒక హీరోయిన్ ను అత్యంత పిచ్చిగా ప్రేమించాడు తెలుసా! ప్రేమించాడు కానీ తన ప్రియురాలిని పెళ్లి చేసుకోలేకపోయాడు. ఇప్పటికీ తన జీవితంలో ప్రేమ అంటే తనే అంటుంటారు కమల్. ఇంతకీ ఆయన ప్రేమించిన హీరోయిన్ ఎవరు.. ? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి! కమల్ హాసన్ 1978లో భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి వాణి గణపతిని వివాహం చేసుకున్నాడు. కానీ వీరు పెళ్లైన పదేళ్లకు అంటే 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి సారిక ఠాకూర్ ను 1988లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. 2004లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు నటి గౌతమితో సహజీవనం చేశారు కమల్. అయితే ఎప్పుడైన ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు అతడు చెప్పే ఏకైక పేరు శ్రీవిద్య. కమల్ హాసన్ తో విడిపోయిన తర్వాత ఎంతో బాధపడ్డానని గతంలో శ్రీవిద్య కూడా తెలియజేసింది. కమల్ హాసన్ తో తనకున్న సంబంధం తనను మానసికంగా ఎలా ప్రభావితం చేసిందో శ్రీవిద్య వెల్లడించింది. కమల్, శ్రీవిద్య వీరిద్దరు కలిసి అనేక చిత్రాల్లో నటించారు. అదే సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ గురించి యావత్ సినీ పరిశ్రమకే కాదు.. రెండు కుటుంబాల్లోనూ తెలిసిందే. ఇద్దరికీ పెళ్లి చేయాలనుకున్నారు. కానీ అప్పట్లో శ్రీవిద్య తల్లి వీరి పెళ్లికి 5 ఏళ్లు ఆగాలని చెప్పడంతో కమల్ అందుకు అంగీకరించలేదట. అప్పుడు కమల్ వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. శ్రీవిద్య తల్లి అలా చెప్పడంతో వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కలేదు. ఆ తర్వాత శ్రీవిద్యతో విడిపోయిన కమల్.. వెంటనే వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. కమల్ పెళ్లి విషయం తెలిసి తాను మానసిక ఎంతో కృంగిపోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదేళ్లుగా డస్ట్‌బిన్ వాడని కుటుంబం.. ఎలా మేనేజ్ చేస్తున్నారంటే
క్లౌడ్ సక్ తో మేఘంలోకి వెళ్లిన పారాగ్లైడర్.. భయానక అనుభవం ఎలా ఉందంటే
పులితో సెల్ఫీకి ట్రై చేశాడు.. ఇంతలోనే షాక్
ఇంట్లో.. పక్షి గూడు కడితే శుభమా.. అశుభమా ??
చుట్టుముట్టిన అడవి పందులు.. దిమ్మదిరిగే షాకిచ్చిన చిరుత