
అయితే పక్షులు ఇలా ఇళ్లలో గూళ్లు కట్టడం ఆ ఇంటివారికి మంచిదా..కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. ఈ క్రమంలో పెద్దలు సూచించిన దాని ప్రకారం.. ఇళ్ళలో పక్షులు గూడు కట్టడం ఆ ఇంటికి శుభప్రదమైన సంకేతంగా చెబుతారు. పక్షి గూడు కట్టిన ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటుందని నమ్మకం. పక్షులు తమ గూడు కోసం ఎంచుకునే స్థలం సురక్షితంగా, శుభశక్తులతో నిండినదిగా ఉంటుందని విశ్వసిస్తారు. ఇల్లు పక్షులకు ఆశ్రయం కలిగించే స్థలంగా మారినప్పుడు.. అక్కడ సానుకూల శక్తులు ఉండే సూచనగా భావిస్తారు. ఇంట్లో పక్షి గుడ్లు పెడితే అదృష్టం కలుగుతుందని చెబుతారు. ఇది ఒక మంచి శకునంగా భావిస్తారు. గుడ్లు ఉన్న చోట మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలుగుతుంది. ఇది ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం కూడా కలిగిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచుతుంది. పిట్టల గూడు ద్వారా ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిట్టల మాదిరిగానే గబ్బిలాలు కూడా ఇంట్లో గూడు కడతాయి. కానీ ఇది మంచిది కాదని చెబుతారు. గబ్బిలం ఇంట్లో ఉంటే అది దురదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. గబ్బిలం బలహీన సంకల్పానికి ప్రతీకగా ఉంటుంది. ఇంట్లో గబ్బిలం ఉండటం వల్ల ఆ కుటుంబంలో గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది. గబ్బిలాలు చీకటికి సంబంధించిన జీవులు కావడం వల్ల వాటి ఉనికి నెగటివ్ శక్తులకు సూచనగా మారుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చుట్టుముట్టిన అడవి పందులు.. దిమ్మదిరిగే షాకిచ్చిన చిరుత
ఆడుకుంటూ కింద పడ్డ బాలుడు.. మెదడులోకి చొచ్చుకెళ్లిన మేకు.. తర్వాత..
చోరీ కేసులో అరెస్టయిన వ్యక్తి… అతని కథ విని షాకయిన పోలీసులు
సైబర్ క్రైమ్‌లో మీ డబ్బు పోయిందా? తిరిగి పొందాలంటే ఇదే మార్గం